Mahesh Fans : అభిమానులా మ‌జాకా.. ఆ న్యూస్ చాన‌ల్‌ను ప‌చ్చి బూతులు తిడుతున్నారు..!

Mahesh Fans : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. స‌మాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమాకు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అయితే కొంద‌రు ఈ సినిమాపై నెగెటివ్ టాక్‌ను వ్యాప్తి చేస్తున్నారు. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ వారిని వెతికి ప‌ట్టుకుని మ‌రీ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్ ఈ మూవీ గురించి నెగెటివ్ టాక్ చేయ‌గా.. మ‌హేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా బాగుంటే నెగెటివ్ టాక్‌ను ఎలా వ్యాప్తి చేస్తారంటూ.. వారు ఆ చాన‌ల్ యాజ‌మాన్యంపై మండిప‌డుతున్నారు.

ఇక ఆ చాన‌ల్‌ను మ‌హేష్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు. అంతేకాదు.. ఆ చాన‌ల్ పేరుకు ఒక బండ బూతును చేర్చి దాన్ని హ్యాష్‌ట్యాగ్‌గా మార్చి ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో దెబ్బ‌కు దిగి వ‌చ్చిన స‌ద‌రు చాన‌ల్ యాజ‌మాన్యం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. స‌ర్కారు వారి పాట బాగుందంటూ వార్త‌ల‌ను ప్ర‌సారం చేసింది. అయిన‌ప్ప‌టికీ మ‌హేష్ ఫ్యాన్స్ మాత్రం వెనక్కి త‌గ్గ‌డం లేదు. త‌ప్ప‌నిస‌రిగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్‌గా మారింది.

Mahesh Fans

కాగా స‌ర్కారు వారి పాట మూవీకి గాను తొలి 3 రోజుల్లో రూ.112 కోట్ల గ్రాస్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే తొలి వారం రోజులు ఈ మూవీకి ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌స్తాయోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక స‌ర్కారు వారి పాట అనంత‌రం కాస్త బ్రేక్ తీసుకున్న త‌రువాత మ‌హేష్ త్రివిక్ర‌మ్‌తో క‌లిసి సినిమా చేస్తారు. త‌రువాత రాజ‌మౌళి సినిమా ఉంటుంది. ఇది 2023లో ప్రారంభం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM