గురువారం, జూన్ 11, 2026
వినోదం

మహేష్ బాబు ‘బెస్ట్ ఫ్రెండ్’ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించిన పేరు!

టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న‌ మహేష్‌బాబు వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. భారీ పాన్-వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ సూపర్‌స్టార్‌ తాజాగా తన జీవితంలో అత్యంత సన్నిహితులు ఎవరో స్వయంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మహేష్ బాబు ‘బెస్ట్ ఫ్రెండ్’ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించిన పేరు!
తన భార్య నమ్రత గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న మహేష్ బాబు. Photo Credit: Mahesh Babu/Instagram.
Mahesh Babu with his wife Namrata Shirodkar at an event.
తన భార్య నమ్రత గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న మహేష్ బాబు. Photo Credit: Mahesh Babu/Instagram.

టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న‌ మహేష్‌బాబు వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. భారీ పాన్-వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ సూపర్‌స్టార్‌ తాజాగా తన జీవితంలో అత్యంత సన్నిహితులు ఎవరో స్వయంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణ తనయుడిగా సినీ రంగంలోకి వచ్చిన మహేష్‌బాబు తండ్రి ఎదుర్కొన్న ఒడిదుడుకులను దగ్గర నుంచి చూశారు. అందుకే పరిమాణం కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తూ, సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా అది పెద్ద ప్రభావం చూపేలా కెరీర్‌ను మలుచుకున్నారు. ఇలా ఆయ‌న పాటిస్తున్న వ్య‌వ‌హార శైలి ఎంతో మందిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.

బెస్ట్ ఫ్రెండ్ ఆమెనే..

సహజంగా మితభాషి అయిన మహేష్‌బాబు ఎక్కువగా మాట్లాడరు. పరిచయాలు ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ప్రత్యేకంగా ఎవరినీ చెప్పుకోరు. షూటింగ్‌లకు దూరంగా ఉన్నప్పుడు తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తూ, తరచూ విదేశీ విహారయాత్రలకు వెళ్లడం ఆయన అలవాటు. ఇటీవల హీరోగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌ను మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని ప్రశ్నించగా, క్షణం కూడా ఆలోచించకుండా నా భార్య అని సమాధానమిచ్చారు. ఈ ఒక్క మాటతోనే నమ్రత శిరోద్కర్‌ తన జీవితంలో, కెరీర్‌లో ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది.

అన్నింటినీ న‌మ్ర‌త‌నే చూసుకుంటారు..

ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, మహేష్ కెరీర్‌పై నమ్రత సలహాలు, సూచనలు గణనీయమైన ప్రభావం చూపినట్లు చెబుతారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత ఆయన మళ్లీ నిలదొక్కుకోవడంలో ఆమె పాత్ర కీలకమన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. వంశీ పైడిపల్లి వంటి దర్శకులతో మహేష్ సెలవులకు వెళ్లినా, వ్యక్తిగతంగా మాత్రం దూరమే పాటిస్తారు. కార్యక్రమాల్లో అందరితో స్నేహపూర్వకంగా కనిపించినా, తన ఖాళీ సమయాన్ని మాత్రం కుటుంబానికే పరిమితం చేస్తారు. ప్రస్తుతం మహేష్‌బాబు.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం వారణాసితో పాన్-వరల్డ్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి