Mahesh Babu : నటుడిగా అదరగొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం ఆహా కోసం హోస్ట్‌గా మారారు. అన్‌స్టాపబుల్ అనే షోని ఆహా కోసం చేస్తుండగా.. ఇప్పటికే డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నేచురల్ స్టార్ నాని హాజరై సందడి చేశారు. ముఖ్యంగా బాలయ్య , మోహన్ బాబు ముచ్చట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మూడో ఎపిసోడ్ కు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం హాజరు కానున్నారు. ఆయనతోపాటు షోలో అనిల్ రావిపూడి కూడా సందడి చేయబోతున్నాడు. వీరి రచ్చ పీక్స్ లో ఉండనుంది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరు కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరికీ సంబంధించిన అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్‌ను డిసెంబర్ 4న షూట్ చేయనున్నట్టు సమాచారం. ఇటీవలే తారక్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేష్ హాజరయ్యాడు. దాంతో ఇప్పుడు బాలయ్య టాక్ షో కు కూడా మహేష్ రానున్నండని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది చూడాలి.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన అఖండ సినిమా మంచి విజయం సాధించింది. అఖండ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇస్మార్ట్ హీరో రామ్ పోస్ట్‌లు పెట్టేశారు. అఖండ చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపారు. అఖండతో అద్భుతమైన ఆరంభం.. ఎంతో సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను గారికి, చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…