Mahesh Babu : బాల‌య్య షోలో మ‌హేష్ సందడి చేయ‌నున్నాడా.. ఇక మాస్ జాత‌రే.!

December 3, 2021 5:21 PM

Mahesh Babu : న‌టుడిగా అద‌ర‌గొట్టిన బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఆహా కోసం హోస్ట్‌గా మారారు. అన్‌స్టాప‌బుల్ అనే షోని ఆహా కోసం చేస్తుండగా.. ఇప్పటికే డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నేచురల్ స్టార్ నాని హాజరై సందడి చేశారు. ముఖ్యంగా బాలయ్య , మోహన్ బాబు ముచ్చట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మూడో ఎపిసోడ్ కు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం హాజరు కానున్నారు. ఆయ‌న‌తోపాటు షోలో అనిల్ రావిపూడి కూడా సంద‌డి చేయ‌బోతున్నాడు. వీరి రచ్చ పీక్స్ లో ఉండ‌నుంది.

Mahesh Babu may participate in balakrishna unstoppable show

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజ‌రు కాబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరికీ సంబంధించిన అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్‌ను డిసెంబర్ 4న షూట్ చేయనున్నట్టు సమాచారం. ఇటీవలే తారక్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేష్ హాజరయ్యాడు. దాంతో ఇప్పుడు బాలయ్య టాక్ షో కు కూడా మహేష్ రానున్నండని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది చూడాలి.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన అఖండ సినిమా మంచి విజ‌యం సాధించింది. అఖండ సినిమా సక్సెస్ సెల‌బ్రేషన్స్ మొదలయ్యాయి. దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇస్మార్ట్ హీరో రామ్ పోస్ట్‌లు పెట్టేశారు. అఖండ చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపారు. అఖండతో అద్భుతమైన ఆరంభం.. ఎంతో సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను గారికి, చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment