Mahesh Babu : బాలీవుడ్‌ను మ‌హేష్ విమ‌ర్శించ‌లేదు.. అస‌లు విష‌యంపై క్లారిటీ ఇచ్చేశారుగా..!

May 11, 2022 1:03 PM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్‌గా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ మే 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇందులో మ‌హేష్ ప‌క్క‌న కీర్తి సురేష్ జోడీగా న‌టించ‌గా.. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ క్ర‌మంలోనే సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మ‌హేష్ మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆయ‌న సొంత ప్రొడక్ష‌న్ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో మేజ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను మ‌హేష్ తాజాగా లాంచ్ చేశారు.

Mahesh Babu given clarity on his words about Bollywood
Mahesh Babu

అయితే ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో మ‌హేష్‌ను బాలీవుడ్ గురించి కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు. కానీ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లను మార్చి ప్ర‌చురించారు. బాలీవుడ్ అంటే త‌న‌కు ఇష్టంలేద‌ని.. త‌న‌ను బాలీవుడ్ త‌ట్టుకోలేద‌ని.. తెలుగులోనే త‌న‌కు సౌక‌ర్యంగా ఉంద‌ని.. మ‌హేష్ అన్న‌ట్లు క‌థ‌లు అల్లారు. అయితే దీనిపై చాలా మంది మ‌హేష్ బాబును విమ‌ర్శించారు. ముఖ్యంగా ఉత్త‌రాది వారు ఆయ‌న‌ను ట్రోల్ చేశారు. అయితే దీనిపై మ‌హేష్ స్పందించారు.

తాను ఒక‌టి అంటే.. మీడియా దాన్ని ఇంకోలా అర్థం చేసుకుంద‌ని.. తాను బాలీవుడ్‌ను విమ‌ర్శించ‌లేద‌ని.. మ‌హేష్ అన్నారు. త‌న‌కు తెలుగు సౌక‌ర్యంగా ఉంటుంద‌న్న విష‌యం చెప్పాన‌ని.. అయితే తాను తెలుగులో న‌టించే సినిమాలే హిందీలో రిలీజ్ అవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. తెలుగు సినిమాల‌కు ప్ర‌స్తుతం ప్ర‌పంచ స్థాయి ఆద‌ర‌ణ ఉంద‌ని.. క‌నుక తెలుగులోనే స్ట్రెయిట్ సినిమా చేస్తాన‌ని.. ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ అయితే సంతోష‌మే కదా.. అని అన్నారు. అంతేకానీ తాను బాలీవుడ్‌ను విమ‌ర్శించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక మ‌హేష్ త‌న త‌రువాత సినిమా త్రివిక్ర‌మ్‌తో చేయ‌నున్నారు. వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఈ మూవీ పూర్త‌వుతుంది. ఆ త‌రువాత రాజ‌మౌళితో క‌లిసి సినిమా చేస్తారు. ఆ మూవీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతుంది. దీంతో మ‌హేష్ కు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment