Keerthy Suresh : కీర్తి సురేష్‌పై మండిప‌డుతున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్ .. ఎందుకో తెలుసా ?

April 3, 2022 5:41 PM

Keerthy Suresh : మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టిస్తున్న కీర్తి సురేష్‌ విష‌యంలో ఏదో క్లారిటీ మిస్ అవుతుంద‌ని మ‌హేష్ అభిమానులు క‌ల‌త చెందుతున్నారు. నేను శైల‌జ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌.. మహానటి తర్వాత వరుసగా మూడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ ల‌క్ సఖి.. వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలకు అంకితమైతే గుడ్‌లక్ సఖి ఒక్కటే బిగ్‌స్క్రీన్స్‌కి నోచుకుంది.

Mahesh Babu fans very angry on Keerthy Suresh
Keerthy Suresh

త‌లైవా న‌టించిన అన్నాత్తె చిత్రంలో చెల్లెలిగా కీర్తి సురేష్‌ న‌టించింది. ఈ సినిమా కూడా నిరాశపరిచిన‌ బాపతే. ఇక ఎప్పుడో కంప్లీటైన తమిళ్ మూవీ సానికాయితం కూడా డిజిటల్ స్క్రీన్స్‌కే పరిమితమవుతోంది. మెగాస్టార్‌ మూవీ భోళాశంకర్‌లో సోదరి పాత్రకే పరిమితమవుతోంది. సర్కారువారి పాట వచ్చేలోగా ఒక్కటంటే ఒక్క హిట్టయినా కొట్టి చూపించు కళావతీ.. అని వేడుకుంటున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్. కానీ ఈ అమ్మ‌డు ఈ చిత్రాన్ని పూర్తిగా ప‌క్క‌కు పెట్టిన‌ట్టు ప‌డేస్తోంది. మిగ‌తా సినిమాల‌పై పెట్టిన శ్ర‌ద్ధ ఈ సినిమాపై చూపించ‌డం లేద‌ని కొంద‌రు ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో స‌ర్కారు వారి పాట సినిమా గురించి ఎలాంటి పోస్ట్‌లు పెట్ట‌డం లేద‌ని, క‌నీసం ప్ర‌చారాలు కూడా చేయ‌డం లేద‌ని కొంద‌రు వాపోతున్నారు. తమిళ సినిమాల‌పై పెట్టిన శ్ర‌ద్ధ తెలుగు సినిమాల‌పై ఎందుకు పెట్ట‌డం లేదంటూ.. మండిప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా సర్కారువారి పాట సినిమాలోని మొదటి పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండవుతోంది. కానీ.. అందులో మహేష్‌బాబు మతిపోగొడుతున్న కళావతి దగ్గర మాత్రం ఏదో క్లారిటీ మిస్సవుతోందట. మిగతా టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా వరసబెట్టి సినిమాలు చేస్తున్నా ఇంకా ఏదో వెలితిగా అనిపిస్తోందట. మ‌రి కీర్తి సురేష్ ఈ విష‌యంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment