సాధారణంగా ఈ రోజుల్లో ఎవరైనా అగ్ర హీరో సినిమా విడుదలైందంటే చాలు, థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు, తమ అభిమాన హీరోకి భారీ స్థాయిలో కట్ అవుట్లు ఏర్పాటు చేయడం, దండలు వేయడం పాలాభిషేకాలు.. ఇలాంటివి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల థియేటర్ యజమానులు ఎంతో నష్టాన్ని భరించవలసి వస్తోంది. ఇలాంటి సంఘటనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ థియేటర్‌లో చోటు చేసుకుంది.
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని థియేటర్లలో భారీ ఎత్తున ప్రదర్శించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ఈ మూవీ ఘన విజయాన్ని సాధించింది. కాగా ఇంత వరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మూవీని ఇంత భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయలేదు. ఇదే మొదటి సారి అని చెబుతున్నారు.
అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహంతో ఓ థియేటర్ లో సినిమా తెర వద్దకు వెళ్లి దాన్ని చించేశారు. దీంతో థియేటర్ యజమానికి నష్టం కాస్త ఎక్కువగానే వచ్చిందని అంటున్నారు. చిరిగిపోయన తెరను మార్చడానికి కనీసం రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇక అభిమానుల సంతోషం కోసం సినిమాను ప్రదర్శించినపుడు వాళ్లు ఇలా చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని అంటున్నారు.
ఇలా చేయడం అనేది ఒక పనికిమాలిన చర్యగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ జన్మదినం కావడంతో ఇదే విధంగా ఆయన నటించిన జల్సా సినిమాని కూడా పెద్ద స్థాయిలో రీ రిలీజ్ చేయాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మరి ఆ రోజు ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…