వరుస విజయాలతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అఖండతో బాలయ్య బాబు, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, ఎప్పుడు బింబిసారతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించారు. ఒక ఎన్టీఆర్ మినహా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ వరుస పరాజయాలతో సతమతమయ్యారు. అఖండ, బింబిసారతో ఇద్దరూ హిట్ లను ఖాతాలో వేసుకుని సక్సెస్ ఫామ్ లోకి వచ్చేశారు. కోవిడ్ కారణంగా సంక్షోభంలో ఉన్న ఇండస్ట్రీకి సక్సెస్ తో భారీ చిత్రాలు నిర్మించడానికి కొత్త ఊపిరి పోశారు.
నందమూరి అభిమానులు సైతం తమ హీరోల సినిమాల సక్సెస్ తో పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు నటించిన చిత్రాలలో యాదృచ్ఛికంగా ఒక విషయం అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా.. మరి ఆ ఆసక్తికరమైన విషయం ఏంటి అని మీరు కూడా ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం అఖండ. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఒక పాప పాత్ర మెయిన్ కాన్సెప్ట్ కావడం విశేషం. ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, బాలయ్య బాబుకు ఒక పాప కూతురుగా నటించింది. ఈ పాపను కాపాడే నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న మరో బాలయ్య బయటకు రావడంతో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్ మొత్తం పాప చుట్టూనే తిరుగుతూ శత్రువులతో పోరాడి అంతం చేస్తాడు అఖండ. ఈ పాప సెంటిమెంట్ వలన ఈ చిత్రం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం కూడా పాప సెంటిమెంట్ ప్రధానాంశంగా నిలిచిందని చెప్పవచ్చు. పాప కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ కొట్టుకోవడం, అంతేకాకుండా ఎన్టీఆర్ బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్లను మట్టుపెట్టడం జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో కూడా ఒక పాప సెంటిమెంట్ కీలక పాత్రను పోషించింది.
అదేవిధంగా ఈ ఆగస్టు 5న విడుదలైన బింబిసార కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దర్శకుడు వశిష్ట ఒక పవర్‌ఫుల్ కథాంశంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే బింబిసార చిత్రంలో కూడా పాప సెంటిమెంట్ అనేది హైలెట్ గా నిలిచింది. బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ ప్రాణాలు కాపాడి అతడిని మంచివాడిగా మార్చే కథాంశంలో పాప కీలక పాత్ర పోషించింది.
ఈ చిత్రంలో పాపపై ప్రత్యేక పాట ఉండడం కూడా అందరినీ ఆకర్షించింది. ఎప్పటి నుంచో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కి పాప సెంటిమెంట్ బాగా కలసి వచ్చిందని చెప్పవచ్చు. యాదృచ్ఛికంగా ఈ మూడు సినిమాలకు విజయాలకు పాప సెంటిమెంట్ కామన్ ఎలిమెంట్ గా నిలిచి.. కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…