Sithara : అద్భుతమైన స్టెప్పులతో అందరినీ ఫిదా చేసిన మహేష్‌ బాబు కుమార్తె సితార.. వీడియో వైరల్ !

November 25, 2021 3:00 PM

Sithara : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి అందరికీ తెలిసిందే. ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సితార నిత్యం ఏదో ఒక విషయం ద్వారా అభిమానులను సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసింది. ఇందులో సితార చేసిన డాన్స్ చూస్తే ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే.

mahesh babu daughter Sithara dance steps video viral

సితార ఒక వెస్ట్రన్ సాంగ్ కు స్టెప్పులు వేస్తూ అందరినీ సందడి చేసింది. అలా ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ కు సితార డ్యాన్స్‌ స్టెప్స్ చేయడంతో ఆమె  అందరి చేత వావ్ అనిపించుకుంటోంది. ఇక ఈ వీడియోను షేర్ చేసిన సితార సోలో గా ట్రై చేశా ఇంకొకటి చేయమంటారా అంటూ ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/CWqhsFOlUUN/?utm_source=ig_web_copy_link

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం అప్ కమింగ్ హీరోయిన్ సితార అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం  పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now