Mahabaleshwaram : మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌య ప్ర‌త్యేక‌త ఇదే.. అందుక‌నే సెల‌బ్రిటీ జంట‌లు చాలా మంది వెళ్తున్నారు..!

Mahabaleshwaram : ఈ మ‌ధ్య కాలంలో మ‌న‌కు వార్త‌ల్లో త‌ర‌చూ వినిపిస్తున్న ఆల‌యం పేరు ఒక‌టి ఉంది. అదే మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యం. ఇది క‌ర్ణాట‌క రాష్ట్రంలోని గోక‌ర్ణంలో ఉంది. అయితే సెల‌బ్రిటీ జంటలు చాలా మంది ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ ఈ ఆల‌యానికి వెళ్తున్నారు. మొన్న‌టికి మొన్న న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌లు ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోగా.. గ‌తంలో న‌య‌న తార‌, విగ్నేష్‌లు ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ఇక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అయితే సెల‌బ్రిటీ జంట‌లు ఈ ఆల‌యాన్ని త‌ర‌చూ ఎందుకు ద‌ర్శించుకుంటున్నారు ? అంత‌గా దీని ప్ర‌త్యేక‌త ఏముంది ? అన్న వివ‌రాల్లోకి వెళితే..

మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యాన్ని గోక‌ర్ణ క్షేత్రం అని కూడా అంటారు. ఇది గోవాకు అతి స‌మీపంలో ఉంటుంది. క‌నుక ఈ ఆల‌యం ప‌ర్యాట‌కుల‌ను కూడా ఆక‌ర్షిస్తుంటుంది. ఇక్క‌డ ఉన్న‌ది శివుడు. ఆత్మ‌లింగం రూపంలో ఉంటాడు. అప్ప‌ట్లో రావ‌ణాసురుడు త‌న‌కు ఇచ్చిన ఆత్మ లింగాన్ని ఇక్కడే విడిచిపెట్టాడ‌ని స్థ‌ల పురాణం చెబుతోంది. అలాగే మారు వేషంలో వ‌చ్చి లింగాన్ని కింద పెట్టిన వినాయ‌కుడి ఆల‌యం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. క‌నుక ఇందులో శివుడితోపాటు వినాయ‌కున్ని కూడా ద‌ర్శించుకుంటారు. అయితే ఇక్క‌డ కుజ దోష పూజ‌లు కూడా చేస్తారు.

Mahabaleshwaram

మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యంలో కుజ దోష పూజ‌లు చేస్తారు. పెళ్లి కాని వారు, అయిన వారు కూడా ఈ పూజ‌లు చేసుకోవ‌చ్చు. దీంతో ఈ దోషం ప‌రిహారం అవుతుంద‌ని న‌మ్ముతారు. క‌నుక‌నే సెల‌బ్రిటీలు చాలా మంది ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుని పూజ‌లు చేస్తున్నారు. గ‌తంలో న‌య‌న‌తార‌, విగ్నేష్‌లు కూడా ఇక్క‌డ దోష నివార‌ణ పూజ‌లు చేశారు. ఇటీవ‌ల నరేష్‌, ప‌విత్ర లోకేష్‌లు కూడా ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. సెల‌బ్రిటీలు చాలా మంది ఈ ఆల‌యాన్ని బాగా న‌మ్ముతారు. క‌నుక‌నే స‌హ‌జంగానే వారి తాకిడి ఈ ఆల‌యానికి ఎక్కువ‌గా ఉంటుంది.

ఇక మ‌హాబ‌లేశ్వ‌రం చేరుకోవాలంటే విమాన‌మార్గంలో అయితే గోవా బెట‌ర్‌. రైలు మార్గం అయితే గోక‌ర్ణంకు 23 కిలోమీట‌ర్ల దూరంలో కుంట‌, 25 కిలోమీట‌ర్ల దూరంలో అంకోలా స్టేష‌న్లు ఉన్నాయి. వీటికి వ‌చ్చి గోక‌ర్ణంకు రోడ్డు మార్గంలో చేరుకోవ‌చ్చు. రోడ్డు మార్గం అయితే నేరుగానే వెళ్ల‌వ‌చ్చు. ఆల‌యాన్ని ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌రకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం కోసం తెరిచి ఉంచుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM