Mahaan Movie : విక్ర‌మ్ భారీ మూవీ.. ఓటీటీలో రిలీజ్‌.. ఎందులో అంటే..?

January 24, 2022 9:46 PM

Mahaan Movie : ఇటీవ‌ల ఒక నెల రోజుల కింద‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. క‌రోనా కేసులు త‌గ్గాయి, ఇక థియేట‌ర్ల‌కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయని అంద‌రూ భావించారు. అనేక సినిమాలు థియేట‌ర్ల‌లోనే విడుద‌ల‌య్యాయి. కానీ నెల తిరిగే స‌రికి ప‌రిస్థితి అంతా తారుమారైంది. కోవిడ్ మ‌ళ్లీ విజృంభిస్తోంది. దీంతో నిర్మాత‌లు మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను వ‌దిలి ఓటీటీల బాట ప‌డుతున్నారు. ఇక తాజాగా త‌మిళ న‌టుడు విక్ర‌మ్ కూడా ఓటీటీలోనే త‌న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

Mahaan Movie to release on ott

విక్ర‌మ్ న‌టించిన మ‌హాన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించేసింది. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన అమెజాన్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. గ‌త కొద్ది రోజుల నుంచి ఈ చిత్ర విడుద‌ల‌పై అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు అదే నిజ‌మైంది.

ఇక ఈ మూవీలో విక్ర‌మ్‌తోపాటు ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌తో ధ్రువ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. రెండో సినిమాకే త‌న తండ్రితో క‌లిసి చేయ‌డం విశేషం. పిజ్జా, జిగ‌ర్ తండా సినిమాల ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ మ‌హాన్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కార్తీక్ చివ‌రి సినిమా జ‌గ‌మే తంత్రం ఓటీటీలోనే నేరుగా రిలీజైంది.

గత‌లో కార్తీక్ అద్భుత‌మైన సినిమాలు తీసినా.. పేట నుంచి ఫ్లాప్ అవుతున్నాడు. అయితే మ‌హాన్‌తో అయినా అదృష్టం మ‌ళ్లీ వ‌రిస్తుందో, లేదో చూడాలి. ఈ మూవీలో బాబీ సింహా, సిమ్రాన్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment