మా ఎన్నిక‌లు.. మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ.. వైరం పోలేదా ?

October 9, 2021 9:37 AM

రోజులు గ‌డుస్తున్న కొద్దీ మూ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా కొన‌సాగుతున్నాయి. ఇక ప్ర‌చారానికి కేవలం 1 రోజు మాత్ర‌మే మిగిలి ఉంది. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అదే రోజు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. అయితే ఎన్నిక‌లు ఏమో గానీ.. అటు మెగా ఫ్యామిలీ, ఇటు మోహ‌న్ బాబు ఫ్యామిలీల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌మ మ‌ధ్య గొడ‌వ‌లు లేవంటూనే.. సినీ ఇండ‌స్ట్రీల్లో వ‌ర్గాలు ఉన్నాయ‌ని వారు చెప్ప‌క‌నే చెప్పినట్లు అవుతోంది.

maa elections old rivalry between chiranjeevi and mohan babu is not ended does it

గ‌తంలో ఒక‌సారి చిరంజీవి, మోహ‌న్‌బాబుల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, ఇండ‌స్ట్రీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ ఇద్ద‌రూ క‌ల‌సి ఒకే స్టేజిపై క‌నిపించి అలాంటిదేమీ లేద‌ని, తాము స్నేహితుల‌మేన‌ని, ఎవ‌రో అనే మాట‌ల‌ను పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వారు స్నేహితులు అయితే ఇప్పుడు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఎందుకు ? అంద‌రూ క‌ల‌సి ఒకే వ్య‌క్తిని మా అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌చ్చు క‌దా ? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.

సినీ ఇండ‌స్ట్రీలో వివాదాలు కొత్తేమీ కావు. అప్పుడ‌ప్పుడూ అందులో ఉండే లుక‌లుక‌లు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఎన్నిక‌ల్లో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఉన్న వైరం మ‌రోసారి బ‌ట్ట బ‌య‌లైంద‌ని టాక్ న‌డుస్తోంది. ఈ రెండు ఫ్యామిలీలు నిజంగానే స్నేహితులు అయితే అంద‌రూ క‌ల‌సి కూర్చుని మాట్లాడుకుని ఒక‌రినే అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌చ్చు క‌దా.. అలా చేయ‌డం లేదు.. అంటే వైరం ఉన్న‌ట్లేగా.. అని చ‌ర్చించుకుంటున్నారు.

అయితే ఈ వైరం ఎన్నిక‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుందా ? గెలుపు ఓట‌ముల త‌రువాత ఇరు కుటుంబాలు స‌ఖ్య‌త‌గా ఉంటాయా ? లేక ఇప్పుడు ఉన్న‌ట్లుగానే వాతావ‌ర‌ణం ఉంటుందా ? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now