Maa Elections : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ మొదలయ్యాయి. ఈరోజు ఉదయం నుండి మొదలైన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి కేవలం మా అసోసియేషన్ మెంబర్స్ కే కాకుండా ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఎందుకంటే ఇంతకుముందెన్నడూ లేని రీతిలో మా ఎలక్షన్స్ ప్రచారాలు సాగాయి. ముఖ్యంగా పోటీదారులు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఈ ఎన్నికలపై మరింత హీట్ ను పెంచాయి.
ఈ క్రమంలో ఎలక్షన్ టైమ్ లో ఒక ప్యానెల్ సభ్యులు మరో ప్యానెల్ మెంబర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఒక్కటేనని విష్ణు, ప్రకాష్ రాజ్ లు చెప్పారు. కానీ వీరిద్దరి గ్రూప్ ల మధ్య కోల్డ్ వార్ మాత్రం సాగుతూనే ఉంది. ఎలక్షన్ కి ముందే పోలింగ్ టైమ్ లో మాటలు వదులుతూ విమర్శలు చేసుకున్నారు. ఇక మోహన్ బాబు సైతం ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై మండి పడ్డారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఎలక్షన్ అధికారికి కంప్లైంట్ చేశారని, మా సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు పోలింగ్ లోపలికి ఎలా వస్తారంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు ప్యానెల్ లో ఉన్న శివ బాలాజీ, ప్రకాష్ రాజ్ టీమ్ లో హేమల మధ్య గొడవ జరిగింది.
హేమ.. శివబాలాజీ చేయి కొరికిందంటూ నరేష్ మీడియాకు తెలిపారు. శివ బాలాజీని కొరికేసిందంటూ కొరికిన చేతిని మీడియాకు చూపించారు. దీనిపై స్పందించిన హేమ.. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తర్వాతా క్లారిటీగా మాట్లాడతానని పేర్కొంది. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు. తాను ఏమీ అనలేదని, వీడియోలు చూసుకోమ్మని కోరాడు.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…