Maa Elections : మా ఎన్నిక‌లు.. కోట శ్రీ‌నివాస రావుపై దారుణ వ్యాఖ్య‌లు చేసిన నాగ‌బాబు..

October 10, 2021 7:35 AM

Maa Elections : మూ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఆదివారం (అక్టోబ‌ర్ 10, 2021) జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. ఈ రోజే ఫ‌లితాలు రానున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్‌కు చెందిన అభ్య‌ర్థులు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా నాగ‌బాబు.. సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీ‌నివాస రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Maa Elections nagababu serious comments on kota srinivasa rao

తాజాగా ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగ‌బాబు మాట్లాడుతూ.. కోట శ్రీ‌నివాస రావు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఊడిపోతారోన‌ని.. అత్యంత దారుణంగా వ్యాఖ్య‌లు చేశారు. కోట‌ను అన‌కూడ‌ని మాట‌లు అన్నారు.

ప్ర‌కాష్ రాజ్ ఐదు సార్లు జాతీయ అవార్డు పొందార‌ని, కోట శ్రీ‌నివాస రావు, బాబూ మోహ‌న్ వీళ్లంద‌రి క‌న్నా ప్ర‌కాష్ రాజ్ చాలా మంచి న‌టుడ‌ని అన్నారు. ప్ర‌కాష్ రాజ్‌పై అంద‌రూ అసూయ‌గా ఫీల‌వుతున్నార‌ని, అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. కోట శ్రీ‌నివాసరావుకు ఈ వ‌య‌స్సులో ఇదంతా ఏంటీ.. ఆయ‌న ఉప్పుడు ఉంటారో, ఎప్పుడు ఊడిపోతారో తెలియ‌దు.. అని నాగ‌బాబు అన్నారు.

కోట‌ను ఆ మాట‌లు అనొద్ద‌ని అనుకున్నాను.. కానీ ఆయ‌న వ‌య‌స్సుకు త‌గ్గ మాట‌లు మాట్లాడ‌డం లేదు.. వినీ వినీ చిరాకు వ‌స్తోంది. అందుక‌నే ఆయ‌న మీద ఆ వ్యాఖ్య‌లు చేయాల్సి వ‌స్తోంది.. అంటూ నాగ‌బాబు తెలిపారు.

అయితే మ‌రోవైపు మంచు విష్ణు కూడా నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. నాగ‌బాబు అంకుల్ ఏం చేయిస్తున్నారో త‌న‌కు తెలుస‌ని, కావాలంటే త‌న‌ను అనండి.. కానీ త‌న ఫ్యామిలీ జోలికి వెళ్లొద్ద‌ని.. విష్ణు అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment