Love Story : లవ్ స్టోరీ ఆశలపై నీళ్లు చల్లిన ప్రకృతి.. భారీగా పడిపోయిన వసూళ్లు..!

September 29, 2021 6:18 PM

Love Story : కరోనా రెండవ దశ లాక్ డౌన్ అనంతరం ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లవ్ స్టోరీ. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల అంచనాలను తాకి ఈ వారాంతం మూడు రోజులు అత్యధిక వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా టికెట్లు బుక్ అవడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ హవా ఇలాగే కొనసాగితే ఈ సినిమా బయ్యర్లకు లాభాలు తెస్తుందని అందరూ భావించారు.

Love Story : లవ్ స్టోరీ ఆశలపై నీళ్లు చల్లిన ప్రకృతి.. భారీగా పడిపోయిన వసూళ్లు..!
Love Story

అయితే లవ్ స్టోరీ సినిమాపై పెట్టుకున్న ఆశలపై ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్ర చేసిందని చెప్పవచ్చు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆదివారం వరకు అధిక మొత్తంలో కలెక్షన్లను రాబట్టినప్పటికీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో అధికమొత్తంలో వర్షాలు పడడంతో సోమవారం పూర్తిగా కలెక్షన్లు పడిపోయాయి. వాతావరణ పరిస్థితులు మాత్రమే కాకుండా బంద్ కూడా ఉండటం చేత ఆ ప్రభావం సినిమాపై పడిందని చెప్పవచ్చు.

మంగళవారం పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగడంతో పూర్తిగా కలెక్షన్లు తగ్గిపోయాయి. ఇక ముందుగా అనుకున్న విధంగానే లవ్ స్టోరీ సినిమా పెద్దగా కలెక్షన్లను రాబట్టకపోవచ్చు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వారం సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా విడుదల కానుండడంతో ఆ సినిమాకి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో అనే దానిపై ఈ సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now