Lobo Bigg Boss : స్టార్ మా ఛానెల్స్‌లో వీజేగా పని చేసి ఆ తర్వాత పలు షోలలో తన కామెడీతో సందడి చేసిన లోబో బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు. లోబో గత సీజన్‌లో అవినాష్ మాదిరిగా మారిపోయి ఫుల్ కామెడీని పంచాడు. జనాలు, ప్రేక్షకులు చూస్తారు.. ఎంటర్టైనర్ అంటూ తనకు తాను ప్రకటించుకున్నాడు. అలా లోబో మొత్తానికి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సీక్రెట్ రూంలోకి లోబోను పంపించినా కూడా ఆటను మలుపు తిప్పలేకపోయాడు.
బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ అందుకున్న లోబోకి ఇప్పుడు పలు సినిమా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. అందులో చిరంజీవి చిత్రం ఒకటి. రీసెంట్‌గా ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో.. చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతోపాటు ఈ సినిమాను మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్‌లో భోళా శంకర్ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమా తమిళ ‘వేదాళం’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేశ్ చిరు సోదరిగా కనిపించనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…