Bigg Boss 5 : బిగ్ బాస్ 95వ ఎపిసోడ్‌లో మానస్- కాజల్ మధ్య కాసేపు సిరి-షణ్ముఖ్ గురించి డిస్కషన్ నడిచింది. సిరిని షణ్ముఖ్ పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడని మానస్.. కాజల్‌తో అంటాడు. షణ్ను చూపులతోనే సిరిని కంట్రోల్ చేస్తున్నాడని మానస్ అభిప్రాయపడ్డాడు. ఇది స్వయంగా తాను గమనించానని , దీనివల్ల సిరి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందని చెప్పుకొచ్చాడు. ఈ హౌస్‌లో కొనసాగడానికి అలా చేస్తుందని నాకు అనిపించట్లేదని అంటుంది కాజల్.
ఇక బిగ్‌బాస్ జర్నీలో హైలైట్ అయిన సీన్లను తిరిగి ప్లే చేసే గేమ్‌లో.. శ్రీరామ్- జెస్సీలకు కిచెన్‌లో జరిగిన గొడవను రీక్రియేట్ చేసి చూపించాలన్నాడు బిగ్‌బాస్. అయితే షణ్ను మాత్రం ఇప్పటికే ఈ టాస్కుల్లో తనను చులకన చేస్తున్నారని అసహనానికి లోనయ్యాడు. ఈ టాస్క్‌లలో పాల్గొనని మొండికేసి కూర్చున్నాడు. సిరి కన్విన్స్ చేద్దామని వెళితే ఆమెపై ఫైర్ అయ్యాడు. నీవల్ల నాకేం నెగెటివ్ లేదు, నీ మంచి కోసం మాట్లాడితే నేను నెగెటివ్ అవుతున్నాను అంటూ చిర్రుబుర్రులాడాడు.
మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు.. అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్ ఒక్కటే గుర్తుంది..’ అంటూ సిరిని నానామాటలు అన్నాడు. వీళ్లిద్దరి గొడవలో తన తల్లిని కూడా లాగడంతో తనకు తెలియకుండానే సిరి కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. కాసేపటికే ఇద్దరూ కలిసిపోయి హగ్గిచ్చుకున్నారు.
సీన్ రీ క్రియేషన్ టాస్కులో హమీదా ట్యాగ్ మెడలో వేసుకున్న సన్నీని చూడగానే శ్రీరామ్‌లో ప్రాణం లేచి వచ్చినట్లైంది. మిస్ యూ హమీదా అంటూ సన్నీని హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు జరిగిన రీ క్రియేషన్ టాస్కులో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పర్సన్‌గా హౌస్‌మేట్స్ షణ్నును ఎంచుకున్నారు. దీంతో అతడు ఆడియన్స్‌ను ఓటేయమని అడిగే అర్హత పొందాడు. ‘ప్రేక్షకులే నా దేవుళ్లు. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడున్న అందరికీ ఓటేయండి, నాకు కొంచెం ఎక్కువ ఓట్లేయండి’ అని కోరాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…