OTT : ఈ వారం ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించనున్న సినిమాలు ఇవే..!

June 20, 2022 1:32 PM

OTT : ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వారం మారితే థియేటర్ల వద్ద సందడి నెలకొనేది. కానీ ఇప్పుడు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. కొత్త సినిమా ఏది వచ్చినా.. నెల రోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుంది కదా.. అని భావిస్తున్నారు. కనుకనే థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. ఇక ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఓటీటీ యాప్‌లు కూడా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను వారం వారం రిలీజ్‌ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ చేయనున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికే ఇందులో అందుబాటులో ఉంది. కానీ పే పర్‌ వ్యూ పద్ధతిలో చూడాల్సి వస్తోంది. కానీ ఈ నెల 23వ తేదీ నుంచి ఈ మూవీని ఉచితంగానే చూడవచ్చు. అందుకు గాను ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట అమెజాన్‌ ప్రైమ్‌లో సందడి చేయనుంది.

list of movies releasing on June 24th 2022 on OTT apps
OTT

ఇక తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ నటించిన నెంజుకు నీది అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా కూడా ఓటీటీలో ఈ వారమే రిలీజ్‌ అవుతోంది. ఈ మూవీని కూడా ఈ నెల 23వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. సోనీ లివ్‌లో ఈ మూవీని చూడవచ్చు.

మిస్టర్‌ బీన్‌గా ఎంతో పేరుగాంచిన రోవాన్‌ అట్కిన్‌సన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గతంలో చేసిన కామెడీ షోలు ఇప్పటికీ ఎంతగానో అలరిస్తున్నాయి. ఈయన కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఇక ఈయన నటించిన మ్యాన్‌ వర్సెస్‌ బీ అనే మూవీ ఈ నెల 24వ తేదీన రిలీజ్‌ అవుతోంది. దీన్ని నెట్‌ ఫ్లిక్స్‌ యాప్‌లో వీక్షించవచ్చు.

అలాగే ఈ మధ్యే విడుదలై సంచలనం సృష్టించిన డాక్టర్‌ స్ట్రేంజ్‌ మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌ అనే మూవీ కూడా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాను జూన్‌ 22వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ యాప్‌లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఇలా ఈ వారంలో పలు ముఖ్యమైన సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment