Liger Movie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న లైగ‌ర్ ట్రైల‌ర్‌.. దుమ్ము లేపారుగా..!

July 21, 2022 10:48 AM

Liger Movie Trailer : పూరీ జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మూవీ.. లైగ‌ర్‌. ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే విజ‌య్ స‌ర‌స‌న న‌టించింది. అలాగే అంత‌ర్జాతీయ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలోనే మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌ను కొంత సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలోనే ట్రైల‌ర్ దుమ్ము లేపింద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ట్రైల‌ర్‌ను చూస్తుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.

లైగ‌ర్ మూవీని పూరీ జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించారు. పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై పూరీ జ‌గ‌న్నాథ్, చార్మిలు ఈ మూవీని నిర్మించ‌గా.. ఇందులో బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా భాగ‌మ‌య్యారు. హిందీ హ‌క్కుల‌ను ఆయ‌న కొన్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగ‌స్వామ్యం అయింది. ఇక ర‌మ్య‌కృష్ణ ఇందులో విజ‌య్‌కి త‌ల్లిగా న‌టించిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇందులో మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే డైలాగ్స్ అనేకం ఉన్నాయి. అలాగే విజ‌య్ మానరిజం కూడా అద్భుతంగా ఉంది. గ‌త చిత్రాలతో పోలిస్తే విజ‌య్ ఈ మూవీలో పూర్తిగా భిన్న‌మైక లుక్‌లో క‌నిపించాడు. ఇందులో విజ‌య్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా న‌టిస్తున్న‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది.

Liger Movie Trailer launched Vijay mesmerized with his performance
Liger Movie Trailer

ఇక లైగ‌ర్ మూవీ ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా ఈ మ‌ధ్యే ఈ చిత్రంలోని విజ‌య్ లుక్‌కు చెందిన పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. అందులో విజ‌య్ న్యూడ్‌గా క‌నిపించాడు. దీంతో ఆ ఫొటోపై అనేక ట్రోల్స్ వ‌చ్చాయి. ఇక చిత్రంలో మైక్ టైస‌న్‌తో సెల్ఫీ దిగ‌డ‌మే సినిమా క‌థ అని ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now