Liger Movie : 8 రోజుల‌కు గాను లైగర్ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఇవే.. దిమ్మ‌తిరిగి పోయేలా న‌ష్టం..

Liger Movie : పూరీ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రంపై రిలీజ్ కి ముందు ఎన్నో భారీ అంచనాలున్నాయి. అయితే రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు అందరి అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద  డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వినిపించడంతో ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. మొదటి రోజే  సినిమా వారం రోజుల కన్నా ఎక్కువ ఆడదు అంటూ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వెల్లడయ్యాయి.

రూ.120 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఈ చిత్రానికి సగం పెట్టుబడి కూడా సంపాదించలేకపోయింది. పెట్టుబడి పెట్టిన నిర్మాతలను పూర్తిగా నష్టాల వలయంలో నెట్టేసింది. లైగర్ సినిమా రిజల్ట్ దెబ్బకు విజయ్ దేవరకొండ షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఇంతటి డిజాస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత‌ కలెక్షన్లను రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాం.

Liger Movie

ముందుగా ఈ సినిమా 8 రోజులలో కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం. సీడెడ్ రూ.1.93 కోట్లు, నైజాం రూ.5.89 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.1.84 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.0.98 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.0.98 కోట్లు, కృష్ణా రూ.0.92 కోట్లు, గుంటూరు రూ.1.08 కోట్లు, నెల్లూరు రూ.0.73 కోట్లు రాబట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో మొత్తం కలుపుకొని 8 రోజులలో కలెక్షన్స్ కు గాను లైగర్ రూ.14.35 కోట్ల షేర్,  రూ.28.71 కోట్లు గ్రాస్ వచ్చాయి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజులలో కలెక్షన్స్ కు గాను లైగర్ రూ.26.19 కోట్లు షేర్, రూ.52.38 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ రూ.55 కోట్లు వరకు జరిగింది. కానీ 8 రోజులలో వచ్చిన కలెక్షన్స్ ను బట్టి ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి నష్టాలను అంచనా వేస్తే ఈ సినిమాకి దాదాపు రూ.35 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి. చిత్రం ఇలాంటి రిజల్ట్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. మరోవైపు లైగర్ ఫ్లాప్ టాక్ ను ప్రేక్షకులు త్వరగా మర్చిపోవడానికి విజయ్ దేవరకొండ టీమ్ కొత్త ఐడియాలు ఆలోచిస్తోంది.

ఇందులో భాగంగా ఫేక్ కలెక్షన్స్ ను పెట్టి సోషల్ మీడియాలో భారీ కలెక్షన్స్ అంటూ పెయిడ్ ప్రమోషన్స్ తో ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో ఈ తరహా ప్రమోషన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇలా లేని లెక్కలు చూపించే కన్నా.. ముందు నుంచే కథ‌పరంగా జాగ్రత్త తీసుకుంటే బాగుండేద‌ని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. విజయ్ దేవరకొండ కూడా లైగర్ చిత్రానికి వచ్చిన రిజల్ట్ తో పూరీ మరో ప్రాజెక్ట్ అయిన‌ జనగణమన చిత్రాన్ని  ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM