Gajuwaka Conductor Jhansi : గాజువాకకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. ఉద్యోగరీత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి డాన్స్ అంటే ప్రాణమట. ఆ ఇష్టంతోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఝాన్సీ. షోలో వరసగా మూడో వారం కూడా ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. మాస్ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి.. స్టేజ్ మరోసారి దద్దరిల్లి పోయేలా చేసినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ టైమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన ఝాన్సీ.. ఆ ఎపిసోడ్ లో ఠాగూర్ మూవీలోని గప్పు చిప్పు సాంగ్ కు ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత వారం.. పల్సర్ బైక్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసి దుమ్మరేపింది. దీంతో ఝాన్సీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఇక ఈ సాంగ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దాన్ని మించిపోయేలా శ్రీదేవి డ్రామా కంపెనీలో మరోసారి దుమ్మురేపినట్లు కనిపిస్తోంది.
నెక్స్ట్ వీక్ కోసం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే ఈ విషయం అర్థమైపోయింది. వెంటపడి వచ్చేవాళ్లు కుర్రాళ్లు.. అనే ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది ఝాన్సీ. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే.. ఇక ఫుల్ సాంగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రతీ వారం ఝాన్సీ డాన్స్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వుండేటట్లు మేనేజిమెంట్ ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది. ఏదైతేనేం.. ఝాన్సీ లాంటి మహిళలు ఎంతో మందికి ఆదర్శం. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…