Laya : చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. స్టార్ హీరోలతో నటించి సందడి చేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్నారు. మరి కొందరు సోషల్ మీడియా ద్వారా అలరిస్తున్నారు. అయితే ఫ్యామిలీ హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న లయ ఇప్పుడు సినిమాలలో పెద్దగా సందడి చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తోంది. ఈ అమ్మడి జోష్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో లయ తన ఫ్రెండ్స్, కూతురితో కలిసి తెగ డ్యాన్స్ లు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన లయ తర్వాత హీరోయిన్ గా అవతారమెత్తి ప్రేక్షకులను తన అందం, అభినయంతో మెప్పించింది. స్వయంవరం అనే సినిమాతో హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన లయ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వేణు హీరోగా రూపొందిన స్వయంవరం చిత్రం ఆయనకు, లయకు మంచి పేరు సంపాదించి పెట్టింది.
మా బాలాజీ, మనోహరం, దేవుళ్లు, రామ్మా చిలకమ్మా, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, విజయేంద్రవర్మ.. వంటి చిత్రాలలో లయ నటించి ఆకట్టుకున్నారు. కొన్ని కన్నడ, మళయాళ, తమిళ చిత్రాలలోనూ లయ అభినయించారు. 2000లో మనోహరం చిత్రం ద్వారా, 2001లో ప్రేమించు తోనూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు లయ. తాజాగా లయ కళావతి పాటకు డాన్స్ చేశారు. కళావతి సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ డాన్స్ కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…