గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Laya : క‌ళావ‌తి సాంగ్‌కి డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన సీనియ‌ర్ హీరోయిన్..!

Laya : చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. స్టార్ హీరోల‌తో న‌టించి సంద‌డి చేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటుతున్నారు. మ‌రి కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా…

Laya : క‌ళావ‌తి సాంగ్‌కి డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన సీనియ‌ర్ హీరోయిన్..!

Laya : చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. స్టార్ హీరోల‌తో న‌టించి సంద‌డి చేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటుతున్నారు. మ‌రి కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా అల‌రిస్తున్నారు. అయితే ఫ్యామిలీ హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న లయ ఇప్పుడు సినిమాల‌లో పెద్ద‌గా సంద‌డి చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ ర‌చ్చ చేస్తోంది. ఈ అమ్మ‌డి జోష్ చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ల‌య త‌న ఫ్రెండ్స్, కూతురితో క‌లిసి తెగ డ్యాన్స్ లు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది.

Laya danced for Kalaavathi song video viral
Laya

బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ల‌య తర్వాత హీరోయిన్ గా అవతారమెత్తి ప్రేక్షకులను తన అందం, అభినయంతో మెప్పించింది. స్వయంవరం అనే సినిమాతో హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన లయ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వేణు హీరోగా రూపొందిన స్వ‌యంవ‌రం చిత్రం ఆయనకు, లయకు మంచి పేరు సంపాదించి పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

మా బాలాజీ, మనోహరం, దేవుళ్లు, రామ్మా చిలకమ్మా, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, విజయేంద్రవర్మ.. వంటి చిత్రాలలో లయ నటించి ఆకట్టుకున్నారు. కొన్ని కన్నడ, మళయాళ, తమిళ చిత్రాలలోనూ లయ అభినయించారు. 2000లో మనోహరం చిత్రం ద్వారా, 2001లో ప్రేమించు తోనూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు లయ. తాజాగా ల‌య క‌ళావ‌తి పాటకు డాన్స్ చేశారు. కళావతి సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ డాన్స్ కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి