Akira Nandan : వాహ్‌.. క‌ళావ‌తి సాంగ్‌ను పియానోపై వాయించిన ప‌వ‌న్ త‌న‌యుడు అకీరా నంద‌న్‌..!

May 21, 2022 6:21 PM

Akira Nandan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌నకు ఇంకా సరైన వ‌య‌స్సు రాలేదు. అయిన‌ప్ప‌టికీ తండ్రిని మించిన త‌న‌యుడు అనిపించుకంటున్నాడు. ఇటీవ‌లే త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అకీరా నంద‌న్ ర‌క్త‌దానం చేసి ఎంతో మంది మ‌న‌సుల‌ను గెలుచుకున్నాడు. ఇక తాజాగా మ‌రోమారు శభాష్ అనిపించుకున్నాడు. అకీరా నంద‌న్ త‌న తండ్రిలాగే అనేక క‌ళ‌ల్లో ఇప్ప‌టికే ప్రావీణ్యం సంపాదించాడు. వాటిల్లో పియానో వాయించ‌డం కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమాలోని క‌ళావ‌తి సాంగ్‌ను అకీరా నంద‌న్ పియానోపై అద్భుతంగా వాయించాడు.

సర్కారు వారి పాట మూవీ ఎంత‌టి ఘ‌న విజయాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీలోని అన్ని పాటలు బాగున్నాయి. స‌మాజానికి మెసేజ్ ఇచ్చే మూవీ కావ‌డంతో దీన్ని అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఇక ఈ మూవీలోని క‌ళావ‌తి పాట‌ను ముందుగా రిలీజ్ చేశారు. ఈ పాట సూపర్ డూప‌ర్ హిట్ అయింది. అయితే ఈ పాట‌కు ఎంతో మంది ఇప్ప‌టికే స్టెప్పులు వేయ‌గా.. అకీరా నంద‌న్ మాత్రం ఈ పాట‌ను సంగీత వాయిద్యంపై వాయించాడు.

Akira Nandan played Kalaavathi song on piano Pawan Kalyan fans very happy
Akira Nandan

పియానోపై అకీరా నంద‌న్ ఈ పాట‌ను వాయిస్తుంటే.. ఎంతో అద్భుతంగా సంగీతం రావ‌డం విశేషం. పియానోలో అకీరా నంద‌న్ ఇంత‌టి ప్రావీణ్యం సంపాదించాడా.. అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వాయిద్యానికి చెందిన వీడియోను అత‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే అకీరా నంద‌న్ టాలెంట్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akira Nandan (@akiranandan)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now