Laya : అద్భుతంగా డ్యాన్స్‌ చేసిన లయ.. వీడియో వైరల్‌..!

May 13, 2022 5:26 PM

Laya : దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మరోమారు వెండితెర ప్రేక్షకులను పలకరించారు. ఆయన నటించిన సర్కారు వారి పాట మూవీ మే 12వ తేదీన విడుదలై రికార్డుల వేట దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తుండడంతో మహేష్‌ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడని అంటున్నారు. ఇక ఇందులో ఆయనకు జోడీగా కీర్తి సురేష్‌ నటించింది. ఇందులో ఆమె కాస్త విసుగైన క్యారెక్టర్‌లో నటించింది. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే మూవీని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒక మెసేజ్‌ ఇచ్చే మూవీగా దీన్ని తెరకెక్కించారు. అందుకనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులోని అన్ని పాటలు ఇప్పటికే హిట్‌ అయ్యాయి. వాటిలో పెన్నీ సాంగ్‌ ఒకటి.

సర్కారు వారి పాట చిత్రం నుంచి ముందుగా కళావతి అనే పాటను రిలీజ్‌ చేయగా.. ఆ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఆ తరువాత వచ్చిన పాటే.. పెన్నీ. ఇందులో మహేష్‌ కుమార్తె సితార డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఈ పాటను రిలీజ్‌ చేసినప్పుడు సితార డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ పాటకు ఇప్పటికే ఎంతో మంది డ్యాన్స్‌లు చేశారు. తాజాగా సీనియర్‌ హీరోయిన్‌ లయ కూడా పెన్నీ సాంగ్‌కు స్టెప్పులేసింది.

Laya penny song video viral
Laya

సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్‌కు ఇప్పటికే చాలా మంది స్టెప్పులు వేసి ఎంజాయ్‌ చేశారు. వారి జాబితాలో లయ కూడా చేరింది. ఈమె ఇప్పటికే ఈ మధ్య కాలంలో విడుదలైన పలు మూవీల్లోని పాటలకు డ్యాన్స్‌లు చేసి అలరించింది. ఈమె స్వతహాగా డ్యాన్సర్‌ కావడంతో ఇలాంటి స్టెప్పుడు వేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఇక లయ పెన్నీ సాంగ్‌కు చేసిన డ్యాన్స్‌ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇంత వయస్సు వచ్చినా ఆమెలో ఆ డ్యాన్స్‌ కళ తగ్గలేదు. దీంతో ఆమె డ్యాన్స్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈమె ఈ మధ్య కాలంలో తరచూ సోషల్‌ మీడియాలో ఇలాంటి డ్యాన్స్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తుండగా.. అవన్నీ వైరల్‌ అవుతున్నాయి. ఇక పెన్నీ సాంగ్‌కు చెందిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment