Laya : అల‌నాటి అందాల హీరోయిన్ ల‌య కుమార్తెను చూశారా..?

July 19, 2022 10:14 AM

Laya : ఒక‌ప్ప‌టి అందాల హీరోయిన్ ల‌య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె 90ల‌లో హీరోయిన్‌గా ఎంత‌గానో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా 1999 నుంచి 2003 వ‌ర‌కు ఈమెకు గోల్డెన్ టైమ్ న‌డిచింద‌నే చెప్పాలి. ఆ స‌మ‌యంలో ల‌య న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఫ్యామిలీ, ల‌వ్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో ల‌య ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈమె తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఒక‌ప్ప‌టి తెలుగు హీరోయిన్ల త‌రువాత ల‌య‌కే అంత పేరు వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ల‌య చూడ‌చ‌క్కని అందం, అభినయంతోనే కాదు.. త‌న నాట్యంతోనూ ఆక‌ట్టుకుంది. స్వ‌త‌హాగా నృత్యాకారిణి కావ‌డంతో సినిమాల్లో చేయ‌డం ఈమెకు పెద్ద‌గా ఇబ్బంది కాలేదు. గ్లామ‌ర్ షో చేయ‌కపోయినా ఈమెకు న‌ట‌న ప‌రంగా అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. ఇక ల‌య‌కు సినీ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఈమె సినిమాల్లో రాణిస్తుండ‌గానే డాక్ట‌ర్ శ్రీ‌గ‌ణేష్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుంది. త‌రువాత అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. వీరికి ఒక కుమారుడు వ‌చ‌న్‌, కుమార్తె శ్లోక ఉన్నారు.

have you seen Laya daughter photos viral
Laya

అయితే ల‌య అప్పుడ‌ప్పుడు త‌న కుమార్తెతో క‌లిసి ప‌లు సినిమా పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తుంటుంది. కానీ ఈమె కుమార్తెకు చెందిన ఫొటోల‌ను క్లోజ‌ప్‌లో ఏవీ విడుద‌ల చేయ‌లేదు. ఇక ఇటీవ‌లే త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి విహార యాత్ర‌కు వెళ్లిన ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సోష‌ల్ మీడియాలో ల‌య ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.

ఇక ఈమ‌ధ్యే ఆమె త‌న కుమార్తె శ్లోక ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. దీంతో ఆమెను చూసి అచ్చం త‌ల్లిలాగే క్యూట్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె కుమార్తె ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే శ్లోక సినిమాల్లోకి వ‌స్తుందా.. రాదా.. అనే విష‌యం మాత్రం సందిగ్ధ‌మే. ఎందుకంటే ల‌య అమెరికాలో సెటిల్ అయింది క‌నుక త‌న పిల్ల‌ల‌ను సినిమాల వైపు కాకుండా ఇత‌ర రంగాల వైపు మ‌ళ్లించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌రి ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment