Roja : రోజా.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోంది. మరోవైపు రాజకీయాలలోను యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్నాళ్లూ ఎంఎల్ఏగా ఉన్న రోజాకు మంత్రి పదవి దక్కింది. దీంతో ఆవిడ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రోజాకి హోదా మారడంతో జబర్ధస్త్, సినిమాల సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు.. జబర్ధస్త్‌తోపాటు సినిమాలకు కూడా దూరంగా ఉంటానని తెలిపారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావటంతో.. తిరుపతి జిల్లా నుంచి తనకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. తాను యాక్టింగ్ చేయాలని చాలా మంది కోరుతున్నా.. ఇప్పుడు మంత్రిగా బాధ్యత పెరిగిందన్నారు. సీఎం జగన్ ఏనాడూ షూటింగ్ లు ఎందుకు చేస్తున్నావని అడగలేదని చెప్పారు. తాను ఏ రోజూ ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోలేదని.. ప్రతిపక్షాల పైన మాత్రం రాజకీయంగా విమర్శలు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తనను అసెంబ్లీలో చూడకూడదని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అసెంబ్లీలో కనిపించడం లేదన్నారు. తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడంతో టీడీపీతోపాటు తోక పార్టీకి ఎక్కడో కాలుతోందని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు జబర్ధస్త్ అంటే కంటెస్టెంట్స్ అందించే వినోదం పాటు జడ్జిగా ఉన్న నాగబాబు, రోజాల ఎనర్జిటిక్ స్మైల్స్ కూడా మంచి బూస్టప్ ఇచ్చేవి. కొన్ని కారణాల వల్ల నాగబాబు షో నుంచి తప్పుకున్నా.. రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్ ను వదలలేదు. ఒక పక్క ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క జబర్దస్త్ షో పై అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. ఎంతమంది జడ్జిలు వచ్చినా.. వెళ్లినా రోజా లేని జబర్దస్త్‌ను ఊహించుకోలేం.. అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…