Rana : భీమ్లా నాయక్ నుంచి సరికొత్త అప్‌డేట్‌.. రానా హీరోయిన్ ఎవరో తెలుసా ?

October 3, 2021 8:50 PM

Rana : సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్‌ ను విడుదల చేశారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది.

Rana : భీమ్లా నాయక్ నుంచి సరికొత్త అప్‌డేట్‌.. రానా హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఇకపోతే డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్న రానా సరసన నటించడం కోసం ముందుగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని, కొంత చిత్రీకరణ కూడా చేసిన తర్వాత ఈ సినిమా నుంచి ఐశ్వర్య రాజేష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉన్న ఫలంగా ఆమె సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం చేత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే చిత్రబృందం రానా సరసన నటించడం కోసం మరో హీరోయిన్ వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే రానా సరసన మలయాళం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించబోతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now