Krithi Shetty : బేబ‌మ్మ‌కు ఆఫ‌ర్ల వెల్లువ‌.. ల‌క్ మామూలుగా లేదుగా..!

June 7, 2022 4:49 PM

Krithi Shetty : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి జోరు మీదుంది. వ‌రుస సినిమాల‌ను ఓకే చేస్తూ.. శ‌ర‌వేగంగా సినిమాల్లో న‌టిస్తూ దూసుకెళ్తోంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ బ్యూటీ మొద‌టి సినిమాతోనే హిట్‌ను సాధించింది. త‌రువాత చేసిన రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న ఈమెకు కోలీవుడ్ లోనూ వ‌రుసగా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

బాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు సూర్య ఓ మూవీని చేస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేశారు. ఇక త‌మిళ స్టార్ హీరో ధనుష్ ప‌క్క‌న కూడా ఈమె న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసిన‌ట్లు తెలుస్తోంది. ధనుష్ ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని చేస్తున్నారు. దీని త‌రువాత ధ‌నుష్ ఇంకో ద‌ర్శ‌కుడితో మ‌రో మూవీని చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో కృతికి అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇంకో త‌మిళ మూవీలో న‌టించేందుకు కూడా కృతికి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కానీ దాన్ని ఆమె ఇంకా ఓకే చేయ‌లేదట‌.

Krithi Shetty getting back to back offers from Tollywood and Kollywood
Krithi Shetty

అయితే త‌మిళంలో ఇంకో రెండు సినిమాలను వ‌రుస‌గా ఓకే చేస్తే.. అప్పుడు తెలుగు, త‌మిళంలో వేర్వేరుగా హ్యాట్రిక్ మూవీలు చేసిన‌ట్లు అవుతుంది. ఇలా కృతిశెట్టి తెలుగు, త‌మిళంలలో వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. ఆరంభంలోనే ఈమెకు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే ఈమె కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చూడాలి. ఇక రామ్ స‌ర‌స‌న ది వారియ‌ర్ అనే మూవీలో న‌టిస్తున్న ఈమె త‌న డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి విడుద‌లైన రెండు పాట‌లు ఆక‌ట్టుకుంటుండ‌గా.. వీటిలో బుల్లెట్ సాంగ్ బాగా ట్రెండింగ్‌లో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment