Krithi Shetty : సినీ ప్రపంచంలో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత హీరోయిన్స్ ఒక చిత్రం సక్సెస్ అయ్యిందంటే చాలు, సినిమాలతో బిజీగా ఉంటూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోతారు. వరుసలతో ఆఫర్స్ తో దూసుకుపోతున్న టైంలో ఒక్క ఫ్లాప్ పడితే చాలు దిమ్మతిరిగి దేవుడు గుర్తుకొస్తాడు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కి దేవుడిపై భక్తి పెరిగినట్లు ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా మటుకు సక్సెస్ కన్నా ఫ్లాపులే సంపాదించుకున్నాయి.
ఇప్పుడు ఇదే భయం కన్నడ బ్యూటీ కృతి శెట్టికి కూడా మొదలైనట్లు ఉంది. మొదటి చిత్రమైన ఉప్పెనతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో సక్సస్ ను అందుకొని హ్యాట్రిక్ హిరోయిన్ గా ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ అంటూ మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ బ్యూటీకి గత కొన్ని రోజులుగా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది.
ఇటీవల విడుదలైన రామ్ పోతినేనితో నటించిన ది వారియర్, నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో కృతి శెట్టి గుడులు గోపురాలు అంటూ పూజలు చేస్తూ తిరుగుతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి తన నెక్స్ట్ సినిమా సక్సెస్ కావాలని గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయించిందట. ఇప్పుడు ఈ విషయమే కన్నడ మీడియాలో వైరల్ గా మారింది. తన నెక్స్ట్ చిత్రం హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీగా మొక్కులు కూడా మొక్కిందంట కృతి. మరి దేవుడు ఆమె కోరికను విన్నాడో లేదో అనేది నెక్స్ట్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ఈ వార్తతో సినీ విశ్లేషకులు కృతికి తన కెరీర్ పై భయం పట్టుకుందని మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…