Anchor Suma : రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ, ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరలోకి అడుగు పెట్టింది యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తుంటుంది సుమ. సుమ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరు. అందరినీ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంది. ఒకరకంగా సుమ కోసమే కొందరు ఈవెంట్ చూస్తారు అంటే నమ్మశక్యం కాదు. ఏళ్లకి ఏళ్లుగా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ బిగ్ ఈవెంట్ హోస్ట్ కావడంతో టాప్ దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్‌ని ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే సుమ హోస్టింగ్ కోసం ఎదురుచూస్తుంటారు.
సుమ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూనే ఉంటుంది కన్నీరు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. సుమను చూసిన వాళ్లంతా అనుకుంటారు సుమకు ఏం కష్టాలు లేవేమో, కష్టాలే తెలీదేమో అని.. కానీ అది కరెక్ట్ కాదు. సుమ కూడా రోజు ఇంటికి వెళ్లి బాధపడుతుందట. కన్నీరు పెట్టుకుంటుందట ఎందుకో తెలుసా..? తన అత్త, రాజీవ్ కనకాల అమ్మ ఆమె పక్కన లేకపోవడం. గత కొంతకాలం కిందట ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో అత్తా కోడలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాము ముంగిసల్లా ఎప్పుడు ఎదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. కానీ సుమకి వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం.
తన అమ్మ తర్వాత అమ్మలాగా భావించిన అత్త లేకపోవడంతో సుమ ఇప్పటికీ బాధపడుతుందట. తాను ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని షో స్ చేసినా ఏ ఈవెంట్స్ కి వెళ్ళినా.. తన పిల్లల్ని దగ్గరుండి తనకన్నా బాగా చూసుకునే వారట ఆవిడ. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటానని సుమ తన స్నేహితురాలికి చెప్పడంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇది తెలిసిన నెటిజన్లు ఎంత సంపాదించినా మనం ప్రేమించిన వారు పక్కన లేనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం అని కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…