Anchor Suma : నవ్వుతూ.. మనల్ని నవ్వించే యాంకర్ సుమ.. నిజ జీవితంలో ఇంత బాధ పడుతుందా..?

September 1, 2022 10:21 PM

Anchor Suma : రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ, ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరలోకి అడుగు పెట్టింది యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తుంటుంది సుమ. సుమ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరు. అందరినీ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంది. ఒకరకంగా సుమ కోసమే కొందరు ఈవెంట్ చూస్తారు అంటే నమ్మశక్యం కాదు. ఏళ్లకి ఏళ్లుగా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ బిగ్ ఈవెంట్ హోస్ట్ కావడంతో టాప్ దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్‌ని ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే సుమ హోస్టింగ్ కోసం ఎదురుచూస్తుంటారు.

సుమ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూనే ఉంటుంది కన్నీరు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. సుమను చూసిన వాళ్లంతా అనుకుంటారు సుమకు ఏం కష్టాలు లేవేమో, కష్టాలే తెలీదేమో అని.. కానీ అది కరెక్ట్ కాదు. సుమ కూడా రోజు ఇంటికి వెళ్లి బాధపడుతుందట. కన్నీరు పెట్టుకుంటుందట ఎందుకో తెలుసా..? తన అత్త, రాజీవ్ కనకాల అమ్మ ఆమె పక్కన లేకపోవడం. గత కొంతకాలం కిందట ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో అత్తా కోడలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాము ముంగిసల్లా ఎప్పుడు ఎదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. కానీ సుమకి వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం.

Anchor Suma very sad after going to home daily know what happens
Anchor Suma

తన అమ్మ తర్వాత అమ్మలాగా భావించిన అత్త లేకపోవడంతో సుమ ఇప్పటికీ బాధపడుతుందట. తాను ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని షో స్ చేసినా ఏ ఈవెంట్స్ కి వెళ్ళినా.. తన పిల్లల్ని దగ్గరుండి తనకన్నా బాగా చూసుకునే వారట ఆవిడ. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటానని సుమ తన స్నేహితురాలికి చెప్పడంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇది తెలిసిన నెటిజన్లు ఎంత సంపాదించినా మనం ప్రేమించిన వారు పక్కన లేనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం అని కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now