గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Krithi Shetty : త‌న నెక్ట్స్ సినిమా హిట్ కావాల‌ని కృతి ఏం మొక్కు మొక్కిందంటే..?

Krithi Shetty : సినీ ప్రపంచంలో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత హీరోయిన్స్ ఒక చిత్రం సక్సెస్ అయ్యిందంటే చాలు,  సినిమాలతో బిజీగా ఉంటూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోతారు. వరుసలతో ఆఫర్స్ తో దూసుకుపోతున్న టైంలో ఒక్క ఫ్లాప్ పడితే…

Krithi Shetty : త‌న నెక్ట్స్ సినిమా హిట్ కావాల‌ని కృతి ఏం మొక్కు మొక్కిందంటే..?

Krithi Shetty : సినీ ప్రపంచంలో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత హీరోయిన్స్ ఒక చిత్రం సక్సెస్ అయ్యిందంటే చాలు,  సినిమాలతో బిజీగా ఉంటూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోతారు. వరుసలతో ఆఫర్స్ తో దూసుకుపోతున్న టైంలో ఒక్క ఫ్లాప్ పడితే చాలు దిమ్మతిరిగి దేవుడు గుర్తుకొస్తాడు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కి దేవుడిపై భక్తి పెరిగినట్లు ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా మటుకు సక్సెస్ కన్నా ఫ్లాపులే సంపాదించుకున్నాయి.

ఇప్పుడు ఇదే భయం కన్నడ బ్యూటీ కృతి శెట్టికి కూడా మొదలైనట్లు ఉంది. మొదటి చిత్రమైన‌ ఉప్పెనతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో సక్సస్ ను అందుకొని హ్యాట్రిక్ హిరోయిన్ గా ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ అంటూ మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ బ్యూటీకి గత కొన్ని రోజులుగా బ్యాడ్ టైం నడుస్తున్న‌ట్టుంది.

Krithi Shetty done pooje in temple for success
Krithi Shetty

ఇటీవల విడుదలైన రామ్ పోతినేనితో నటించిన ది వారియర్, నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో కృతి శెట్టి గుడులు గోపురాలు అంటూ పూజలు చేస్తూ తిరుగుతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి తన నెక్స్ట్ సినిమా సక్సెస్ కావాలని గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయించిందట. ఇప్పుడు ఈ విషయమే కన్నడ మీడియాలో వైరల్ గా మారింది. తన నెక్స్ట్ చిత్రం హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీగా మొక్కులు కూడా మొక్కిందంట కృతి. మరి దేవుడు ఆమె కోరికను విన్నాడో లేదో అనేది నెక్స్ట్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ఈ వార్తతో సినీ విశ్లేషకులు కృతికి తన కెరీర్ పై భయం పట్టుకుందని మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి