Prabhas : కృష్ణంరాజు సంతాప సభ భోజ‌నానికి ప్రభాస్ ఎంత‌ ఖర్చు పెట్టాడో తెలుసా.. షాక‌వుతారు..

September 30, 2022 8:35 AM

Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన సంతాప సభను సొంత ఊరు మొగల్తూరులో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభాస్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు ప్రభాస్ కూడా అక్కడికి వెళ్లాడు. ప్రభాస్ సన్నిహితులు వారం రోజుల ముందు నుండే అక్కడ ఏర్పాట్లను ప్రారంభించారు. లక్ష మందికి పైగా హాజరయ్యేలా ప్రచారం చేశారు. అయితే లక్ష 20 వేల మందికి సరిపోయే ఆహార పదార్థాలను వడ్డించాలని ముందుగా ప్లాన్ చేశారు. అందుకోసం బడ్జెట్ 3 కోట్ల రూపాయలను కేటాయించారు.

ఈ రూ.3 కోట్లను ప్రభాస్ తన ఖాతా నుండి ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల ఆస్తి కృష్ణంరాజు ఫ్యామిలీ సొంతం, అయినా కూడా పెదనాన్నపై ఉన్న అభిమానంతో ప్రభాస్ 3 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడంట. ప్రభాస్ 3, 4 రోజుల నుండి స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నాడని సంతాప సభ ఏర్పాట్లు చేసిన వారంటున్నారు. ఈ సంతాప సభలో పెట్టిన భోజనం మెనూ గురించి కొన్ని సంవత్సరాల వరకు అభిమానులు మరిచిపోలేని రేంజ్ లో ఉందట. ఇంతకు భోజనంలో ఏం వడ్డించారో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.

krishnam raju santhapa sabha food cost by Prabhas
Prabhas

ఐటమ్స్ వివరాల్లోకి వెళితే.. 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల మటన్ బిర్యానీ, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు, 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ఉన్నాయి. జాబితా చూస్తుంటే కాస్త ఖర్చైనా మొగల్తూరు వెళ్లి రెబల్ స్టార్ ఇంట భోజనం చేస్తే బాగుండేది అనిపిస్తుంది కదా.. ఇది తెలిసిన నెటిజన్లు ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజు ఎక్కడున్నా రాజే అంటూ అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now