Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టి.. ఆ తర్వాత విలన్‌గా మారి.. ఆపై రెబల్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1990లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ తరుపున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుతం బీజేపీ సభ్యుడిగా కొనసాగతున్న కృష్ణం రాజు మర్యాదకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. అతిథులకి ఎన్నో మర్యాదలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. తన పెదనాన్న దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడు. ఇంటికి వచ్చే వారికి లేదంటే షూటింగ్ స్పాట్‌లోనూ ప్రభాస్ అద్భుతమైన ఫుడ్ పెట్టి ఆహా అనేలా చేస్తాడు. ఇటీవలి కాలంలో చాలా మందికి ప్రభాస్ అద్భుతమైన భోజనం రుచి చూపించాడు.
అయితే కృష్ణంరాజు ఇంట్లో గడిచిన 25 సంవత్సరాలుగా పద్మ అనే మహిళ పని చేస్తోంది. 25 ఏళ్లుగా పని చేస్తున్న నేపథ్యంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు . ఈ సందర్భంగా కృష్ణంరాజు దంపతుల ఆశీర్వాదం తీసుకుంది పద్మ. కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి పద్మకు బంగారు చైన్ బహుమతిగా అందజేశారు. ఇన్నేళ్లుగా తమకు తోడుగా ఉన్న పద్మకు ధన్యవాదాలు చెప్తూ ఫొటోలు షేర్ చేసింది ప్రభాస్ సోదరి ప్రసీద. ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…