గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Krishnam Raju : కృష్ణం రాజు దంప‌తుల‌ది ఎంత పెద్ద మ‌న‌సు.. ప‌ని మ‌నిషికి అంత పెద్ద బ‌హుమ‌తి ఇచ్చారా..!

Krishnam Raju : రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టి.. ఆ తర్వాత విలన్‌గా మారి.. ఆపై రెబల్ స్టార్‌గా తన కంటూ…

Krishnam Raju : కృష్ణం రాజు దంప‌తుల‌ది ఎంత పెద్ద మ‌న‌సు.. ప‌ని మ‌నిషికి అంత పెద్ద బ‌హుమ‌తి ఇచ్చారా..!

Krishnam Raju couple given gift to their home servant padma

Krishnam Raju : రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టి.. ఆ తర్వాత విలన్‌గా మారి.. ఆపై రెబల్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1990లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ తరుపున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ప్ర‌స్తుతం బీజేపీ సభ్యుడిగా కొనసాగతున్న కృష్ణం రాజు మ‌ర్యాద‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. అతిథుల‌కి ఎన్నో మ‌ర్యాదలు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. తన పెదనాన్న దారిలోనే ప్ర‌భాస్ కూడా నడుస్తున్నాడు. ఇంటికి వచ్చే వారికి లేదంటే షూటింగ్ స్పాట్‌లోనూ ప్రభాస్ అద్భుతమైన ఫుడ్ పెట్టి ఆహా అనేలా చేస్తాడు. ఇటీవ‌లి కాలంలో చాలా మందికి ప్ర‌భాస్ అద్భుత‌మైన భోజ‌నం రుచి చూపించాడు.

అయితే కృష్ణంరాజు ఇంట్లో గడిచిన 25 సంవత్సరాలుగా పద్మ అనే మహిళ పని చేస్తోంది. 25 ఏళ్లుగా పని చేస్తున్న నేప‌థ్యంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు . ఈ సందర్భంగా కృష్ణంరాజు దంపతుల ఆశీర్వాదం తీసుకుంది పద్మ. కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి పద్మకు బంగారు చైన్ బహుమతిగా అందజేశారు. ఇన్నేళ్లుగా తమకు తోడుగా ఉన్న పద్మకు ధన్యవాదాలు చెప్తూ ఫొటోలు షేర్ చేసింది ప్రభాస్ సోదరి ప్రసీద. ఈ ఫొటో అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి