Krishnam Raju Last Wish : కృష్ణం రాజుకు మిగిలిపోయిన ఏకైక కోరిక.. తీర‌కుండానే చ‌నిపోయారు.. తీవ్రంగా బాధ‌ప‌డుతున్న ఫ్యాన్స్‌..

September 11, 2022 3:26 PM

Krishnam Raju Last Wish : చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో నిండిపోయింది. గత కొంతకాలంగా వరుస విషాదాలతో నిండిపోతున్న సినీ ఇండస్ట్రీకి కొద్దిసేపటి క్రితమే ఉలిక్కిపడే వార్త వినిపిచింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు షాక్ లో ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెలవారుజామున 3.25 గంటలకు ఆయన కన్నుమూశారు. ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. మొదట్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత  భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 170కి పైగా చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Krishnam Raju Last Wish did not fulfilled
Krishnam Raju Last Wish

కొంతకాలంగా డయాబెటిస్, కరోనరీ హార్ట్ డీసీజ్ తోపాటు దీర్ఘ కాలిక కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు ఇలా సడెన్ గా మరణించడంతో సినీ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ వార్తతో రెబల్ అభిమానులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రస్తుతం రెబల్ స్టార్ కృష్ణంరాజు జీవితంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక తీరకుండానే చనిపోయారంటూ ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు సినీ వారసుడిగా ప్రభాస్ ని చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ప్రభాస్ కి వివాహం చేయాలని బాగా ట్రై చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ పెళ్లి చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ రావడంతో, చివరికి ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ప్రభాస్ పెళ్లి చూడకుండానే, చివరి కోరిక తీరకుండానే కృష్ణంరాజు చనిపోయారు. ప్రభాస్ పెళ్లి విషయంపై ఈ వార్తలు ప్రచారం కావడంతో రెబల్ స్టార్ అభిమానులు మరింతగా బాధపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now