Krishna Family : సూపర్ స్టార్ కృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్..!

November 15, 2022 9:48 PM

Krishna Family : సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఫ్యామిలీని గత కొంతకాలంగా దుర‌దృష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నవంబర్ 15 తెల్లవారుజామున 4:09 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఏడాదిలోనే మహేష్ బాబు కుటుంబంలో ముగ్గురు మృతి చెంద‌డం నిజంగా ఆ కుటుంబానికి తీర‌ని లోటే అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం జ‌న‌వ‌రి 8న కృష్ణ పెద్ద కుమారుడు ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్‌బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కృష్ణ ఉండగానే కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతోన్న ర‌మేష్‌బాబు తీవ్ర అనారోగ్యంతో చిన్న వ‌య‌స్సులోనే మృతి చెంద‌డం కృష్ణ‌ను మానసికంగా క‌లిచి వేసింది.

తండ్రి తర్వాత తండ్రిలా అన్ని విధాల తనకు అండగా ఉంటున్న అన్న రమేష్ బాబు మరణం  మ‌హేష్‌ను కూడా ఎంతో బాధ‌ పెట్టింది. ఆ బాధ నుంచి కోలుకోక ముందే మ‌హేష్‌బాబు ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ‌హేష్ త‌ల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 28న మృతి చెందారు. 2019 విజ‌య‌నిర్మ‌ల మృతితో కృష్ణ తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. ఈ బాధ నుంచి బయటపడక ముందే ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణం, ఆ తర్వాత  మొదటి భార్య ఇంద్రరా దేవి మరణం కూడా కృష్ణాను తీవ్రంగా కృంగదీసింది.

Krishna Family got bad sentiment 3 died in a year
Krishna Family

ఏదేమైనప్పటికీ ఓకే ఏడాదిలో  8 నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఏకంగా ముగ్గురు మృతిచెంద‌డం మహేష్ బాబు కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోఖాన్ని మిగిల్చింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మృతిచెంద‌డం ఘట్టమనేని కుటుంబానికి  ఓ బ్యాడ్ సెంటిమెంట్‌గా మారింది. మ‌హేష్ బాబు ఈ విషాదాల నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలని మానసికంగా దృఢంగా నిలబడాలని  సినీ ప్రముఖులతో పాటు  ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు అంద‌రూ కూడా కోరుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now