Hari Hara Veeramallu : పవన్ హరి హర వీరమల్లు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ క్రిష్.!

October 7, 2021 9:43 PM

Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

kirsh comments on Hari Hara Veeramallu movie

క్రిష్, పవన్ కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఈ సినిమా ఒక బాహుబలిగా మారబోతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ప్రేక్షకులకు ఇదొక షాక‌ర్ లాంటిదని.. ఇలాంటి సినిమా తానూ చేయ‌లేదని.. ఇప్ప‌టిదాకా ఈ విధమైన సినిమాలు తెలుగులో రాలేదని.. ఈ సందర్భంగా క్రిష్ తెలిపారు.

చరిత్రలో ఉన్న కొన్ని పాత్రలను తీసుకుని తనదైన శైలిలో వాటికి మెరుగులు దిద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ఈ అద్భుతమైన సినిమాలో పవన్ కళ్యాణ్న టించడం ఎంతో ప్రత్యేకం అని ఈ సందర్భంగా డైరెక్టర్ తెలియజేశారు. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అవుతుందని.. వచ్చే వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now