Konidela Upasana : టెస్ట్ చేయించుకుంటే.. ఆ విష‌యం బ‌య‌ట ప‌డింది : ఉపాస‌న

May 11, 2022 6:08 PM

Konidela Upasana : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ స‌తీమ‌ణి ఉపాస‌న ఎల్ల‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. ఆమె తాను చేసే ప‌నులు, త‌న కార్యక్ర‌మాల‌కు సంబంధించిన ఫొటోలు, అప్‌డేట్స్‌తోపాటు.. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా సోషల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌తో పంచుకుంటారు. ఇక తాజాగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆమె ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌లు సంఘ‌ట‌న‌ల గురించి వివ‌రించారు. త‌న‌కు క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆమె షేర్ చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఇక ఉపాస‌న ఏం పోస్ట్ చేశారంటే..

Konidela Upasana said that she is cured from covid
Konidela Upasana

తాను చెన్నైలోని తాత‌, అమ్మ‌మ్మ‌ల‌ను క‌లిసేందుకు వెళ్లాన‌ని.. అయితే స్వ‌ల్పంగా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని.. దీంతో టెస్ట్ చేయించుకున్నాన‌ని.. కోవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని చెప్పారు. అయితే తాను ముందుగానే క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నాన‌ని క‌నుక ల‌క్ష‌ణాలు పెద్ద‌గా లేవ‌ని అన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఇలా స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో కోవిడ్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇక త‌న‌కు వైద్యులు పారాసిట‌మాల్‌, విట‌మిన్ ట్యాబ్లెట్స్‌ను మాత్ర‌మే ఇచ్చారని వివ‌రించారు.

ఇక కోవిడ్ నుంచి తాను కోలుకున్నాన‌ని కూడా ఉపాస‌న తెలిపారు. త‌న‌కు నీర‌సం, జుట్టు రాల‌డం, ఒళ్లు నొప్పులు వంటి స‌మ‌స్య‌లు రాలేద‌నిఅన్నారు. క‌రోనా త‌న‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని.. తాను మాన‌సికంగా, భౌతికంగా దృఢంగా ఉన్నాన‌ని.. అందుక‌నే త‌న‌పై కోవిడ్ ప్ర‌భావం చూపించ‌లేద‌ని తెలిపారు. ఇక త‌న‌కు వైద్యం అందించిన అపోలో హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల‌కు ఆమె కృత‌జ్ఞ‌తలు తెలిపారు. క‌రోనా మ‌ళ్లీ వ‌స్తుందా.. అంటే రాదు.. అని చెప్ప‌లేం. కానీ మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాల్సిందే.. అని ఉపాస‌న వివ‌రించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment