Konidela Niharika : డ్ర‌గ్స్ వివాదం త‌ర్వాత స‌రికొత్త లుక్‌లో కనిపించిన నిహారిక‌.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

April 26, 2022 5:40 PM

Konidela Niharika : మెగా డాట‌ర్ నిహారిక వివాదాల‌కు చాలా దూరంగానే ఉంటుంది. కానీ ఊహించ‌ని విధంగా ఈ అమ్మ‌డు డ్ర‌గ్స్ కేసులో బుక్ అయింది. రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని స‌మాచారం అందుకున్న‌ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో నాగబాబు కుమార్తె నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. నిహారిక తప్పు లేదంటూ నాగబాబు విడుదల చేసిన వీడియోపై కూడా నెటిజన్లు ట్రోల్స్ చేశారు.

Konidela Niharika appeared in gym after drugs case
Konidela Niharika

తెల్లవారుజాము దాకా పబ్ ఓపెన్ చేసి ఉండడం యాజమాన్యం తప్పేనని.. కానీ అర్ధరాత్రి 2 గంటల దాకా కూతురు భర్తను వదిలేసి పబ్‌లలో చిందులు వేయడం తప్పు కాదా అని నాగబాబును నెటిజన్లు ప్రశ్నించారు. కొంద‌రు ఆమెను డ్ర‌గ్స్ క్వీన్ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. డ్రగ్స్ ఇష్యూ త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన నిహారికకి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటోలో షార్ట్ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపించింది. ఇక షార్ట్ నిక్కర్ తో మోడ్రన్ జిమ్ డ్రెస్ లో తన ట్రైనర్ తో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నిహారిక మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది.

నిహారిక యూట్యూబ్ లో వెబ్ సిరీస్ ల‌లో న‌టించ‌డం, నిర్మించ‌డంతో కెరీర్ ను ప్రారంభించింది. ఆ త‌ర‌వాత ఢీ డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తూ అభిమానుల‌ను సంపాదించుకుంది. నిహారిక త‌న టాలెంట్ తో యాంక‌ర్ గా స‌క్సెస్ అయింది. ఆ తరువాత త‌నకు న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ హీరోయిన్ గా అనుకున్న మేర స‌క్సెస్ అవ్వలేకపోయింది. ఇక నిహారిక ఆ త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పి చైత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ స‌భ్యులు, బంధువుల మ‌ధ్య వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment