Kondapolam Review : కొండపొలం సినిమాకు రివ్యూ ఇచ్చిన మెగాస్టార్.. ఏమన్నారంటే ?

October 8, 2021 10:20 AM

Kondapolam Review : మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “కొండపొలం”. ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 8, 2021) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో వైవిధ్యభరితంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా నేడు విడుదల కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను గురువారం చూసి ఈ సినిమాపై స్పందించారు.

Kondapolam Review chiranjeevi interesting comments on movie

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఒక రోజు వైష్ణవ్ తన దగ్గరకు వచ్చి ఇలా క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను మామయ్య అంటే మరొక మాట ఆలోచించకుండా క్రిష్ దర్శకత్వంలో సినిమా అంటే ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది.. అందుకే చేసేయ్ అని చెప్పాను. నేను ఎలాగైతే చెప్పానో అచ్చం అలాగే వైష్ణవ్ ఫర్ఫార్మెన్స్ క్యారెక్టరైజేషన్ ఎంతో భిన్నంగా ఉన్నాయని మెగాస్టార్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే కొండపొలం సినిమా విషయానికి వస్తే అంటూ.. గత చిత్రాల కంటే ఎంతో వైవిధ్యభరితంగా ఉంది. ఈ ప్రకృతిని ఏవిధంగా కాపాడుకోవాలో ఎంతో చక్కగా తెలియజేసిన చిత్రం కొండపొలం. ఒక మంచి మెసేజ్ తో కూడిన లవ్ స్టోరీ ఈ సినిమా.. అంటూ ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని.. ఈ సందర్భంగా మెగాస్టార్.. కొండపొలం సినిమా గురించి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now