Kiara Advani : సౌత్, నార్త్‌లో దుమ్ము రేపుతున్న అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడికి ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కియారా అద్వానీ కబీర్ సింగ్ అనే ఒక్క మూవీతో బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. స్టార్ హీరోయిన్ స్టేటస్‌కి చేరుకుంది. గతంలో రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. అది హిట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అతనితో కలిసి ఓ సినిమా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
కియారా కొద్ది రోజులుగా సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా లవ్‌లో ఉన్న కియారా తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పినట్టు వస్తున్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. వీరి బ్రేకప్‌పై బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నా తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ అది గొడవల వల్ల కాదని, షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల.. అంటూ.. అందరినీ ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్ ఫ్రెండ్స్. తాజాగా తమ బ్రేకప్ వార్తలపై కియారా అద్వానీ స్పందించింది.
తాజాగా జరిగిన భూల్ భూలయ్యా 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయ్ంపై ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్న వేశాడు ఓ జర్నలిస్ట్. మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా ? అని అడగగా, దీనికి కియారా కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ప్రతి ఒక్కరు నా జీవితంలో ఇంపార్టెంట్. ఎవరినీ మరచిపోవాలని అనుకోవట్లేదు.. అంటూ బదులిచ్చింది. ఇదిలా ఉండగా ఇద్దరూ కలిసి పార్టీల్లో చెట్టాపట్టాలేసుకు తిరగడం, హలీడే వెకేషన్‌కు వెళ్లడం, బర్త్ డే వేడుకల్లో ఎంజాయ్ చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…