Naga Chaitanya : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా అందరి దృష్టినీ ఆకర్షించిన నాగ చైతన్య-సమంత గత ఏడాది అక్టోబర్ 2న విడిపోయిన సంగతి తెలిసిందే. వారు విడిపోయి చాన్నాళ్లే అవుతున్నా కూడా వారికి సంబంధించిన విషయాలు నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. సమంత అయితే నాగ చైతన్య ఙ్ఞాపకాలను కూడా చెరిపేస్తూ సోషల్ మీడియాలో అతని ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్న సమంత చైతూకి మాత్రం దూరంగా ఉంటోంది.
ఇక చైతూ కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నాడు. గురువారం సమంత 35వ బర్త్ డే కాగా.. చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ చైతూ మాత్రం సమంత గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. కాకపోతే ఆమె బర్త్ డే రోజు తాను నటించిన దూత వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గురువారం జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో తన సిరీస్ టైటిల్‌తోపాటు నాగచైతన్య లుక్‌ను విడుదలచేశారు. ఈ సిరీస్‌కు దూత అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌లో పాతకాలం నాటి కళ్లద్దాలు ధరించి సీరియస్ లుక్‌లో నాగచైతన్య కనిపిస్తున్నాడు.
చైతన్య ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అతీంద్రియ శక్తులతో అమాయకుల జీవితాల్ని నాశనం చేసే వారిని ఎదుర్కొనే యువకుడిగా పవర్‌ఫుల్ గా అతడి పాత్ర సాగుతుందని సమాచారం. ఈ సిరీస్ లో మళయాళ టాలెంటెడ్ నటి ప్రియా భవాని శంకర్, పార్వతిలు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక వీరంతా కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్‌లో నాగ చైతన్య ప్రస్తుతం థాంక్ యూ సినిమాతో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టబోతున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…