గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Naga Chaitanya : స‌మంత బ‌ర్త్ డే రోజు.. స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన నాగ చైత‌న్య‌..!

Naga Chaitanya : ఒక‌ప్పుడు టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన నాగ చైత‌న్య‌-స‌మంత గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడిపోయిన సంగ‌తి తెలిసిందే. వారు విడిపోయి చాన్నాళ్లే అవుతున్నా కూడా వారికి సంబంధించిన విష‌యాలు…

Naga Chaitanya : స‌మంత బ‌ర్త్ డే రోజు.. స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన నాగ చైత‌న్య‌..!

Naga Chaitanya : ఒక‌ప్పుడు టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన నాగ చైత‌న్య‌-స‌మంత గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడిపోయిన సంగ‌తి తెలిసిందే. వారు విడిపోయి చాన్నాళ్లే అవుతున్నా కూడా వారికి సంబంధించిన విష‌యాలు నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. సమంత అయితే నాగ చైతన్య ఙ్ఞాపకాలను కూడా చెరిపేస్తూ సోషల్‌ మీడియాలో అతని ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేసింది. అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌గా ఉంటున్న స‌మంత చైతూకి మాత్రం దూరంగా ఉంటోంది.

Naga Chaitanya web series first look launched on Amazon Prime
Naga Chaitanya

ఇక చైతూ కూడా అదే ధోర‌ణిని కొన‌సాగిస్తున్నాడు. గురువారం స‌మంత 35వ బ‌ర్త్ డే కాగా.. చాలా మంది ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కానీ చైతూ మాత్రం స‌మంత గురించి ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు. కాక‌పోతే ఆమె బ‌ర్త్ డే రోజు తాను న‌టించిన దూత వెబ్ సిరీస్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. గురువారం జ‌రిగిన అమెజాన్ ప్రైమ్‌ ఈవెంట్‌లో తన‌ సిరీస్ టైటిల్‌తోపాటు నాగ‌చైత‌న్య లుక్‌ను విడుద‌ల‌చేశారు. ఈ సిరీస్‌కు దూత అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో పాత‌కాలం నాటి క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి సీరియ‌స్ లుక్‌లో నాగ‌చైత‌న్య క‌నిపిస్తున్నాడు.

చైత‌న్య ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అతీంద్రియ శ‌క్తుల‌తో అమాయ‌కుల జీవితాల్ని నాశ‌నం చేసే వారిని ఎదుర్కొనే యువ‌కుడిగా ప‌వ‌ర్‌ఫుల్ గా అత‌డి పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. ఈ సిరీస్ లో మళయాళ టాలెంటెడ్ నటి ప్రియా భవాని శంకర్, పార్వతిలు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక వీరంతా కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్‌లో నాగ చైతన్య ప్రస్తుతం థాంక్ యూ సినిమాతో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టబోతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి