Khiladi Movie : ర‌వితేజ ఖిలాడి నుంచి ఫుల్ కిక్ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌..!

January 26, 2022 4:50 PM

Khiladi Movie : ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం.. ఖిలాడి. ఇందులో ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌదరి హీరోయిన‌గా న‌టిస్తోంది. కాగా జ‌న‌వ‌రి 26వ తేదీన ర‌వితేజ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ మూవీలోంచి ఫుల్ కిక్ అనే లిరిక‌ల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

Khiladi Movie full kick song launched

దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని ఫ‌ల్ కిక్ అనే పాట ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. ర‌వితేజ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ఇందులో దేవిశ్రీ‌తో క‌లిసి ర‌వితేజ సాంగ్ పాడిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక ఈ సినిమాలో డింపుల్ హ‌యాతి మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎ స్టూడియోస్ ప‌తాకంపై స‌త్య‌నారాయ‌ణ కోనేరుతోపాటు ర‌మేష్ వ‌ర్మ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment