KGF Yash : పునీత్‌ రాజ్‌కుమార్ హఠాన్మరణంపై.. కేజీఎఫ్‌ హీరో యష్‌ కన్నీటి పర్యంతం..

October 30, 2021 1:55 PM

KGF Yash : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అప్పటి వరకు ఎంతో చలాకీగా, హుషారుగా ఉన్న పునీత్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడం, మరణించడం అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా ఉందని చెప్పవచ్చు.

KGF Yash emotional on the death of puneeth rajkumar

ఇదిలా ఉండగా పునీత్ మరణవార్త విన్న యష్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. రెండు రోజుల క్రితం పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ నటించిన జై భజరంగి 2 సినిమా ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో యష్, పునీత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే పునీత్ తో కలిసి ఎంతో సరదాగా స్టెప్పులు వేశారు. రెండు రోజుల క్రితం ఇలా తనతో కలిసి ఎంతోసరదాగా గడిపిన పునీత్ ఇప్పుడు అకాల మరణం చెందడంతో ఆయన భౌతికకాయాన్ని చూసిన యష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment