Tamannah : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తి చేసుకుని తరువాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగులతో బిజీగా మారారు. మెగాస్టార్, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న తమన్నాకు చిత్రబృందం కోటిన్నర రూపాయలను రెమ్యూనరేషన్ గా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో చిరు చెల్లెలి పాత్రలో నటిస్తున్న కీర్తిసురేష్ కు ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు సమాచారం.
మిల్కీ బ్యూటీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ పాత్రలో నటిస్తున్న తమన్నాకు కీర్తి సురేష్ కన్నా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే తమన్నా రెమ్యూనరేషన్ విషయంలో అన్యాయం జరిగింది.. అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…