Nikita Dutta : సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా రక్షణ లేకుండా పోయింది. నటీమణులపై ఇటీవల వరుస దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నటి షాలు చౌరాసియాపై ఓ దుండగుడు దాడి చేసి ఆమె యాపిల్ ఐఫోన్ లాక్కుని పారిపోయాడు. ఈ దాడిలో చౌరాసియా గాయాలపాలు కావడంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
ముంబైలో నటి నిఖిత దత్తాకు ఇదే తరహా సంఘటన ఎదురైంది. ఆదివారం ఆమె ముంబై బాంద్రా సమీపంలో రోడ్డుపై నడిచివెళుతుండగా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బాంద్రా రోడ్ నంబర్ 14లో రాత్రి 7:45 గంటల సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడిచివెళుతున్న తనపై దాడి చేసి మొబైల్ ను చేతిలో నుండి లాక్కొని వెళ్లిపోయారు అని చెప్పింది. రెండు మూడు సెకండ్స్ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. వెంటనే కోలుకొని బైక్ ని వెంబడించాను అని పేర్కొంది.
నా అరుపులకు అక్కడ ఉన్నవారు స్పందించారు. ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లిద్దరూ వేగంగా బైక్ నడుపుకుంటూ దొరక్కుండా పారిపోయారు. స్థానికులు నాకు మద్దతుగా నిలిచారు. వాటర్ ఇచ్చి నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను.. అని ఆమె వివరించారు. అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. ఇలాంటి విషయాలపై జాగ్రత్త, ధైర్యంగా ఉండు.. అంటూ కామెంట్ చేశారు. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…