Karthika Deepam : డాక్ట‌ర్ బాబు ఫొటోను చూసి ఏడ్చేసిన హిమ‌.. అదే స‌మ‌యంలో శౌర్య ఎంట‌ర్‌..!

April 1, 2022 10:53 AM

Karthika Deepam : బుల్లి తెర‌పై ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సీరియ‌ల్ కార్తీక దీపం. ఈ సీరియ‌ల్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నం చేరుస్తున్నారు. అందువ‌ల్ల ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద రావు ఇంట్లోకి తిరిగి సంతోషం రావాలి అంటే హిమ పెళ్లి చేయాలని సౌంద‌ర్య‌తో అంటాడు. శౌర్య క‌నిపించే వ‌ర‌కు హిమ‌ పెళ్లి చేసుకోన‌ని చెప్పింద‌ని, ఇప్ప‌ట్లో హిమ ద‌గ్గ‌ర ఈ ప్ర‌స్తావ‌న తీసుకు రావ‌ద్ద‌ని సౌంద‌ర్య.. ఆనంద రావుతో అంటుంది.

Karthika Deepam 1st April 2022 episode
Karthika Deepam

మ‌రో వైపు జ్వాల‌(శౌర్య‌) హిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తింగ‌రిది, ఒట్టి అమాయ‌క‌పు ప‌క్షిలా ఉంది, అప్ప‌ట్లో హిమ అన్ని ప్ర‌శ్న‌లు వేస్తూ ఉండేది, ఇప్పుడు ఈ తింగ‌రిది కూడా అలాగే అడుగుతుంది. డాక్ట‌ర్ సాబ్ ను త‌లుచుకుంటేనే నాలో కొత్త శ‌క్తి వ‌స్తుంది. తింగ‌రిని, డాక్ట‌ర్ సాబ్ ను చూస్తే నాకు కావ‌ల‌సిన వాళ్ల‌లా ఉన్నార‌ని అనుకుంటూ ఉంటుంది.

ఇంత‌లో అక్క‌డికి ఇంద్రుడు, చంద్ర‌మ్మ‌లు వ‌స్తారు. ఇంటికి ఆల‌స్యంగా వ‌చ్చినందుకు, ఇంకా దొంగ‌త‌నాలు చేయ‌డం మానేయ‌నందుకు వాళ్ల‌ని జ్వాల‌ తిడుతూ ఉంటుంది. ఇంద్రుడు మేము దొంగ‌త‌నాలు చేయ‌డం మానేసే టైమ్ వ‌చ్చింద‌ని, ఇక పై దొంగ‌త‌నాలు చేయ‌మ‌ని త‌న వీపుపై ఉన్న దెబ్బ‌ల‌ను చూపిస్తూ జ్వాల‌తో చెబుతాడు. జ్వాల‌ ఎమోష‌న‌ల్ గా ఫీల‌వుతూ రేప‌టి నుండి వేరే ప‌ని చేసుకోండి అని చెబుతుంది.

ఇది ఇలా ఉండ‌గా సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు హిమ ఇంటికి రాలేద‌ని టెన్ష‌న్ ప‌డుతూ ఉంటారు. హిమ బ‌స్తీలో ఉండే వాళ్ల పాత ఇంటికి వెళ్లి పాత ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటుంది. డాక్ట‌ర్ బాబు ఫోటోను హ‌త్తుకుని ఏడుస్తూ ఫోటో ముందు పూలు వేసి దీపం వెలిగిస్తుంది. డాడీ నన్ను క్ష‌మించండి, నా వ‌ల్లే మీరు ప్రాణాలు కోల్పోయారు. నా పాపానికి ప్రాయ‌శ్చిత్తం శౌర్య‌ను క‌లుసుకోవ‌డ‌మే అని ఏడుస్తూ ఉంటుంది.

మ‌రో వైపు జ్వాల‌ ఆటోలో ఉండ‌గా ఒక పెద్దాయ‌న వ‌చ్చి బ‌స్తీ వ‌ర‌కు వ‌స్తావా అమ్మ అని అడుగుతాడు. దీంతో జ్వాల‌ పాత ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ ఆ పెద్దాయ‌న‌ను బ‌స్తీలో విడిచి పెట్టి, ల‌క్ష్మ‌ణ్‌, వార‌ణాసిల గురించి అడుగుతుంది. ఆ పెద్దాయ‌న ఆ పేరు గ‌ల వారు ఇక్కడ లేర‌ని చెబుతాడు. త‌రువాయి భాగంలో జ్వాల‌ కూడా వాళ్ల పాత ఇంటికి వెళుతుంది. అక్క‌డ కార్తీక్ ఫోటోకు దండం పెడుతూ, ఆనంద్ నా త‌మ్ముడు, వాడు నా ర‌క్త‌మే అంటున్న హిమ‌ను చూసి షాక్ కు గుర‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment